బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (12:59 IST)

దాసరి నేషనల్ అవార్డుల‌కు సిఎం లను ఆహ్వానిస్తాం

Dasari-Naidu
మే 4న దర్శక దిగ్గజం దివంగత దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని దాసరి కల్చరల్ ట్రస్ట్, ఇమేజ్ ఫిలింస్ సంయుక్తంగా దాసరి పేరిట అవార్డుల‌ను ప్రధానం చేయనున్నారు.‌
 
నిర్మాత తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ.. ‌నా గురువు, దైవం అయిన దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టివి నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పించాం. పాన్ ఇండియా లెవెల్‌లో అన్నీ భాషా చిత్రాల టెక్నిషియన్ల‌కు దాసరి నేషనల్  అవార్డులను ప్రధానం చేయబోతున్నాము.  ఇందుకోసం  ఇప్పటికే "దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్" ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నాము.భారీ స్దాయిలో  హైదరాబాదులోనె జరగనున్న  ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రు లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నాము..వేదిక, అవార్డు కమిటీకి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియచెస్తామన్నారమ‌ని అన్నారు.