శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 27 నవంబరు 2023 (08:53 IST)

వి లవ్ బ్యాడ్ బాయ్ కాన్సెప్ట్ విడుదల

We Love Bad Boys
We Love Bad Boys
బి.ఎమ్.క్రియేషన్స్ నూతన నిర్మాణ సంస్థ వస్తున్న చిత్రం పేరు "వి లవ్ బ్యాడ్ బాయ్స్" (We love Bad Boys). పప్పుల కనకదుర్గారావు నిర్మాత. రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన "వి లవ్ బ్యాడ్ బాయ్స్" చిత్రంలో అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ముఖ్య తారాగణం.

పోసాని కష్ణమురళి, కాశి విశ్వనాథ్, అలి, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ కాపీతో విడుదలకు సిద్ధమైంది. నేటి ట్రెండ్ కు తగిన కథ-కథనాలతో కడుపుబ్బ నవ్వించే కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర దర్శకులు రాజు రాజేంద్ర ప్రసాద్ చెబుతున్నారు.
 
రఘు కుంచె"తో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ కు పాటలు: భాస్కరభట్ల, శ్రీమన్నారాయణాచార్య (విరాట్) గానం: రఘు కుంచె - గీతా మాధురి - లిప్సిక - అరుణ్ కౌండిన్య, మనోజ్ శర్మ కుచి, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎడిటింగ్: నందమూరి హరి, అడిషనల్ స్క్రీన్ ప్లే & డైలాగ్స్: ఆనంద్ కొడవటిగంటి, సినిమాటోగ్రఫీ: వి.కె.రామరాజు, సమర్పణ: శ్రీమతి పప్పుల వరలక్ష్మి.