ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: మంగళవారం, 5 జనవరి 2021 (16:15 IST)

అవ‌కాశాల కోసం వెబ్ ‌సిరీస్ చేయ‌బోయాం, కానీ: సోహైల్

‘దియా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి ఈ క్రైమ్ థ్రిల్లర్‌ ద్వారా టాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంలో సీనియ‌ర్ యాక్టర్ రాజా ర‌వీంద్ర, అర్చనా కుమార్‌, శ్వేతా వ‌ర్మ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. నూత‌న ద‌ర్శకుడు హేమంత్ ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తూ, ర‌చ‌న కూడా చేస్తున్నారు. ఈ ట్రైల‌ర్ హైద‌రాబాద్‌లో బిగ్‌బాస్ విజేత సొహైల్ విడుద‌ల చేశారు.
 
సోహైల్ తెలుపుతూ.. చిత్ర‌మందిర్ బేన‌ర్ నాకు స్వంత బేన‌ర్‌లాంటిది. నాకు అవ‌కాశాలు లేన‌ప్పుడు నిర్మాత రామారావు బాలీవుడ్ వెబ్‌సిరీస్ మొద‌లు పెట్టాల‌నుకున్నాం. కానీ అనుకోకుండా బిగ్‌బాస్‌లో అవ‌కాశం వ‌చ్చింది. దాంతో నా కథే వేరుగా వుంది. ఇప్పుడు నాకు టైం వ‌చ్చింది. రామారావుతో సినిమా చేయ‌బోతున్నాం.
 
రామారావు గురించి చెప్పాలంటే చాలా వుంది. త‌ను నెల‌కు 10ల‌క్ష‌లు సంపాదించుకోగ‌ల‌డు. కానీ సినిమా నిర్మాత‌గా, న‌టుడిగా ఎద‌గాల‌ని, న‌లుగురికి ప‌ని క‌ల్పించాల‌ని ఆయ‌న సినిమాలు తీస్తున్నాడు. లోక‌ల్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తున్నాడు. ఇక ఈ ట్రైల‌ర్ అద్భుతంగా వుంది. అంజి కెమెరామెన్ గ‌రుడ‌వేగ త‌ర్వాత మంచిగా తీశాడు. నేను ఏ సినిమా చేసినా అంజినే వుంటాడు.
 
సురేష్ బొబ్బిలి సంగీతం విన‌సొంపుగా వుంది. క‌న్న‌డ‌లో దియా సినిమా ద్వాత దీక్షిత్ అంద‌రికీ తెలుసు. తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నా. ఇక రాజా ర‌వీందర్ ఈ సినిమాలో గొప్ప‌గా న‌టించాడు. ఆయ‌న ఈ సినిమా త‌ర్వాత నాకు దొర‌క‌డు. అందుకే నా సినిమాలో చిన్న‌వేషం అయినా వేయాలి.. ఇక దీక్షిత్‌.. క‌న్న‌డ‌లో హీరో. దియా సినిమాలో అద్భుతంగా చేశాడు. ఇక ద‌ర్శ‌కుడు హేమంత్ మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు. ఈ టీమ్‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు.
 
ద‌ర్శ‌కుడు హేమంత్‌... త‌క్కువమందితో చాలా అవుట్‌పుట్ ఇచ్చాడు. వెన్నెల సినిమాలో కామెడీ వంటవాడిగా ప్రేక్షకులను అలరించిన నటుడు పి. అచ్యుత్ రామారావు.. ఆ సినిమా పేరునే తన పేరుముందు తగిలించేసుకున్నారు. టాలీవుడ్‌లో ‘వెన్నెల’ రామారావుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగానూ చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఆయన నిర్మిస్తోన్న చిత్రం ‘ది రోజ్ విల్లా’. చిత్రమందిర్ స్టూడియో, ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై ఎ. పద్మనాభరెడ్డితో కలిసి రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.