మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 6 జులై 2021 (19:40 IST)

ఆత్మ‌కూరులో సోనూసూద్ ఆక్సిజ‌న్ ప్లాంట్‌కు ఘ‌న‌స్వాగ‌తం

Atmakur sood oxyge plant
కరోనా వైరస్ త‌ర్వాత ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న బాధ‌ల‌ను గుర్తించి సోనూసూద్ చేస్తున్న సేవ‌లు తెలిసిందే. త‌నే ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశాడు. ఒక రాష్ట్రం అని కాకుండా దేశంలో అన్ని చోట్ల ఆయ‌న ఆక్సిజ‌న్ ను అందించారు. మంగ‌ళ‌వారంనాడు నెల్లూరు జిల్లా లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కి సన్నాహాలు చేయడం జరిగింది. అయితే ఈ మేరకు ఆక్సిజన్ ప్లాంట్ రాక తో నెల్లూరు జిల్లా కి చెందిన ప్రజలు ఘన స్వాగతం పలికారు. సోనూ సూద్ చిత్ర పటానికి హారతి పట్టి, టపాసులతో తమ సంతోషం వ్యక్తం చేశారు. అయితే అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
 
ఆత్మ‌కూరుకు భారీ వాహ‌నంలో ఆక్సిజ‌న్ ప్లాంట్‌కు సంబంధించిన ప‌నిముట్ల‌తోపాటు అన్ని అమ‌ర్చిన మెషిన్సు వ‌చ్చాయి. వాటి రాక సంద‌ర్భంగా మ‌హిళ‌లు, ప్ర‌జ‌లు హారతి ప‌ట్టారు. ఫోన్‌లో సోనూసూద్ ఫొటోకు ద‌న్ణం పెడుతూ వెల్‌క‌మ్ ప‌లికారు. ఎంతోమందికి సహాయం చేసిన సోనూ సూద్ ను ప్రజలు రియల్ హీరో అంటూ ఆత్మ‌కూరు ప్ర‌జ‌లు నినాదాలు చేశారు.