గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2024 (21:38 IST)

Mohan Babu-Manoj: ఏంట్రా మీకు చెప్పేది, మీడియాపై మోహన్ బాబు దాడి (video)

Mohan Babu
Mohan Babu, Manchu Manoj మోహన్ బాబు ఆయన తనయుడు మంచు మనోజ్ మధ్య చెలరేగిన మనస్పర్థలు తారాస్థాయికి వెళ్లిపోతున్నాయి. మనోజ్ నా ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదని మోహన్ బాబు చెప్పిన గంటల్లోనే మంచు మనోజ్ నేరుగా అక్కడికి వెళ్లారు. గేటుకు సంబంధించిన ఫైబర్ ప్లేట్లను తొలగించి ఇంట్లో ప్రవేశించేందుకు దూసుకుని వెళ్లారు. ఆ సమయంలో మోహన్ బాబు ఇంటి బయటకు రావడంతో మీడియా వారు అందరూ ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టి ప్రశ్నలు అడిగారు. దీనితో తీవ్ర ఆగ్రహానికి లోనైన మోహన్ బాబు... ఏంట్రా మీకు చెప్పేది అంటూ మైక్ లాగి విలేకరుల వెంటబడ్డారు. దీనితో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 
గొడవకు అసలు కారణం అదే
మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవలు శనివారంనాడే జరిగాయట. అది ఆదివారంనాడు బయట పడింది. అయితే అసలు గొడవంతా మోహన్ బాబు, మనోజ్‌ల వ్యక్తిగత సిబ్బంది (పనివారి) గురించే వచ్చిందని శంషాబాద్ లోని మోహన్ బాబు ఇంటిలో పనిచేసే ఓ మహిళ తెలియజేసిన చిన్నవీడియో ఓ ఛానల్ బయటపెట్టింది. 
 
ఆమె చెప్పినమాటలను బట్టి, ఇటీవలే మనోజ్‌కు బిడ్డపుట్టింది. దానికి సంబంధించిన ఫంక్షన్ ఇక్కడే చేశారు. మౌనిక, మోహన్ బాబు ఫ్యామిలీ కుటుంబసభ్యులంతా హాజరయ్యారు. అయితే ప్రసాద్ అనే మోహన్ బాబు వ్యక్తిగత సెక్యూరిటీ ప్రవర్తన వల్ల అసలు గొడవ మొదలైంది. దాంతో నీ సెక్యూరిటీ నీది, నా సెక్యూరిటీ అనే రీతిలో మోహన్ బాబు మాట్లాడరట. ఆ తర్వాత మాటా మాటా పెరగడంతోపాటు గతంలో వున్న ఇష్యూస్ కూడా బయటపడడంతో ఒక్కసారి మనోజ్ తన తండ్రిపై చేయిచేసుకున్నాడు.
 
ఈ విషయం తెలిసిన వెంటనే లక్ష్మీప్రసన్న కూడా హుటాహుటిన వచ్చి మనోజ్‌ను మందలించింది.. విష్ణు అన్నకు తండ్రి అంటే ప్రాణం. సార్ మీద చేయి వేసినా ఊరుకోడు. సార్ మీద చేయి వేశాడు మనోజ్ అందుకే ఇంత గొడవ జరిగింది అంటూ ఆమె తెలియజేసింది. ఇక ఇప్పుడు మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చాడు. సమస్య సాల్వ్ చేయడానికే వచ్చాడని అంటున్నారు కానీ విషయం దూరం వెళ్లేలా కనబడుతోంది.