ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్ 'మహాస‌ముద్రం' ఎందుకు ఆగింది..?

Nag-Ajay
శ్రీ| Last Modified సోమవారం, 13 మే 2019 (18:08 IST)
ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి. ఈ సినిమా చిన్ని సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఆ త‌ర్వాత అజ‌య్ భూప‌తితో సినిమా చేసేందుకు నితిన్, రామ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్ర‌స్ట్ చూపించారు. బెల్లంకొండ‌తో అజ‌య్ సినిమా దాదాపు క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది అనుకున్నారు.

అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఆ త‌ర్వాత ఈ క‌థ చైత‌న్య ద‌గ్గ‌రికి వెళ్లింది. చైత‌న్య - అజ‌య్ కాంబినేష‌న్లో మ‌హా స‌ముద్రం క‌న్ఫ‌ర్మ్ అయ్యింది అంటూ వార్త‌లు వ‌చ్చాయి. క‌ట్ చేస్తే... ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. కార‌ణం ఏంటంటే... మ‌జిలీ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టించాడు. వెంకీ మామ అని హార్ట్ ట‌చ్చింగ్ ఎమోష‌న‌ల్ మూవీ చేస్తున్నాడు.


మ‌హా స‌ముద్రం యాక్ష‌న్ మూవీ. అందుచేత ఇప్పుడు యాక్ష‌న్ మూవీ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని నో చెప్పాడ‌ట‌. అయితే...అజ‌య్ ర‌వితేజ‌తో సినిమా చేయ‌నున్నాడ‌ట‌. ఇది మ‌హా స‌ముద్రం క‌థా..?
లేక వేరే క‌థా అనేది తెలియాల్సివుంది.దీనిపై మరింత చదవండి :