Widgets Magazine

గ్రహానుకూలత కోసం మంత్రాలయంలో రాజమౌళి పూజలు..?

బాహుబలి మేకర్ దర్శకుడు రాజమౌళికి సంబంధించిన ఓ వార్త అటు ఫిలిమ్ నగర్‌లోనూ ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవగ్రహాల ప్రసన్నం కోసం రాజమౌళి ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది.

rajamouli
selvi| Last Updated: మంగళవారం, 16 జనవరి 2018 (12:23 IST)
బాహుబలి మేకర్ దర్శకుడు రాజమౌళికి సంబంధించిన ఓ వార్త అటు ఫిలిమ్ నగర్‌లోనూ ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవగ్రహాల
ప్రసన్నం కోసం రాజమౌళి ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. వేద పండితులు చెప్పిన మాటలను జవదాటకుండా రాజమౌళి మంత్రాలయంలో పూజలు చేయిస్తున్నట్టు సమాచారం.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ సినిమాల సమయంలో జక్కన్నకు శుక్రమహాదశ నడిచిందట. ఈ దశలో ఎవరున్నా పట్టిందల్లా బంగారం అవుతుందట. అయితే ప్రస్తుతం రాజమౌళి దశ మారిందట. దీంతో గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయిస్తే బాగుంటుందని పండితులు చెప్పారుట. ఇందుకు సరేనన్న రాజమౌళి.. మంత్రాలయంలో పూజలు చేయించారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.

ఈ గ్రహ పూజల కోసమే మంత్రాలయానికి రాజమౌళి వెళ్లారని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్- ఎన్టీఆర్ లు నటించే మల్టీస్టారర్ మూవీ అఫీషియల్ ప్రకటనకు ముందే వీటిని పూర్తి చేసి.. పూర్తిస్థాయిలో సినిమా షూటింగ్‌లో పాల్గొనాలని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం.


దీనిపై మరింత చదవండి :