గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (10:45 IST)

ముమైత్ వద్ద 7 గంటలపాటు విచారణ : ఏం చెప్పారంటే..

తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో నటి ముమైత్ ఖాన్ వద్ద ఏడు గంటల పాటు విచారణ సాగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట ఆమె బుధవారం హాజరయ్యారు. 
 
ఆమె వద్ద దాదాపు 7 గంటలపాటు కొనసాగిన విచారణలో ముమైత్‌కు ఈడీ అధికారులు పలు ప్రశ్నలను సంధించారు. ప్రధానంగా ఈ కేసులో కీలక నిందితులైన జీషాన్, కెల్విన్‌లతో గల ఆర్థిక సంబంధాలపై ఆమెను ప్రశ్నించారు. ఈడీ ప్రశ్నలకు బదులుగా ముమైత్ ఖాన్ బదులిస్తూ, తన స్నేహితులతో కలిసి హైదరాబాదులో తాను కొన్ని పార్టీల్లో పాల్గొన్నానని, ఆ పార్టీల్లో డ్రగ్స్ వినియోగించలేదన్నారు. 
 
ఆ సమయంలోనే డ్రగ్ సప్లయర్స్ కెల్విన్, జీషాన్‌లు తనకు అక్కడే తెలుసని... అయితే, వారితో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని ఆమె చెప్పింది. తన బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా ఈడీ అధికారులకు ముమైత్ అందజేసింది.
 
మరోవైపు అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై ముమైత్ నుంచి ఈడీ అధికారులు వివరణ తీసుకున్నారు. హీరో నవదీప్‌కు చెందిన ఎఫ్ క్లబ్ కు ముమైత్ ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. వీటిపై ఈడీ అధికారులు ప్రశ్నించగా... అవి కేవలం పార్టీలకు సంబంధించిన లావాదేవీలేనని ముమైత్ సమాధానమిచ్చింది.