శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (14:56 IST)

సాయిపల్లవితో కెమిస్ట్రీ గురించి నాని ఏమన్నాడంటే!

స‌హ‌జ న‌టుడు నాని హీరోగా సాయిప‌ల్ల‌వి నాయిక‌గా న‌టించిన సినిమా `శ్యామ్ సింగ‌రాయ్‌`. ఈ సినిమా షూటింగ్ కొల్‌క‌త్తాలోనూ, చుట్టు ప‌క్క‌ల చోట్ల జ‌రుగుతుంటే అక్క‌డి ప్ర‌జ‌లు బెంగాల్ హీరోపై సినిమా అని తెలుసుకుని తండోప‌తండాలుగా విచ్చేశారు. న‌న్ను చూడ‌గానే రాయ్ కేరెక్ట‌ర్‌కు బాగా సూట‌య్యార‌ని ప్ర‌శంసించారు. ఈ సినిమాలో ఓ చోట బెంగాల్ బాష‌ను మాట్లాడాను. స‌న్నివేశ‌ప‌రంగా సీన్ సీరియ‌స్‌గా వుండ‌డంతో దానికి అక్క‌డివారు క‌నెక్ట్ అయ్యారు. ఈ సినిమా బెంగాల్‌లో కూడా ఎప్పుడెప్పుడు చూడాల‌న్న ఆతృత వారిలో క‌నిపించింది.
 
- ఇది 1960లో క‌థ కాబ‌ట్టి అప్ప‌టి క‌ట్ట‌డాలు, వ‌స్త్రధార‌ణ అన్నీ కేర్ తీసుకుని చేశాం. ఇక సాయిప‌ల్ల‌వితో ఎం.సి.ఎ.లో చేశాను. కానీ ఆ సినిమాలో పూర్తిగా ఆమెతో న‌టించ‌డానికి కుద‌ర‌లేదు. కానీ ఈ సినిమాలో బాగా క‌నెక్ట్ అయ్యే సీన్స్ వుంటాయి. సాయిప‌ల్ల‌విలో చాలా ఫిలాసిఫిక‌ల్ ట‌చ్ వుంది. ఆమెతో మాట్లాడుతుంటే మ‌న‌ల్నికూడా ఆమె రూటులో మార్చేలా చేస్తుంది (న‌వ్వుతూ). అందుకే ఆమెతో మ‌రో సినిమా చేయాల‌నుకున్నాం. ఎం.సి.ఎ. టైంలో మంచి క‌థ‌తో ఆమెతో చేయాల‌నుకున్నా. అది ఇప్ప‌టికి శ్యామ్ సింగ‌రాయ్‌తో కుదిరింది. మా ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బెంగాలీలే ముగ్థుల‌య్యారు. మ‌ర‌లా సాయిప‌ల్ల‌వితో మ‌రో గొప్ప క‌థ‌తో ముందుకు వ‌స్తాను అని నాని తెలిపారు.