శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2016 (17:15 IST)

రణ్‌బీర్‌ని ఆరాధ్య బచ్చన్ తండ్రి అనుకుని డాడీ అంటూ.. కౌగిలించుకుందట.. ఎప్పుడు.. ఎక్కడ?

బాలీవుడ్ యంగ్ స్టార్ రణ్‌బీర్‌కి ఎంత క్రేజుందో తెలిసిందే. అలాగే నాలుగు పదుల వయస్సులోనూ ఐశ్వర్యారాయ్‌కి ఏమాత్రం వయస్సు తగ్గలేదు. రణ్ బీర్- ఐశ్వర్యారాయ్ కలిసి యే దిల్ హై ముష్కిల్ అనే సినిమాలో నటించిన సం

బాలీవుడ్ యంగ్ స్టార్ రణ్‌బీర్‌కి ఎంత క్రేజుందో తెలిసిందే. అలాగే నాలుగు పదుల వయస్సులోనూ ఐశ్వర్యారాయ్‌కి ఏమాత్రం వయస్సు తగ్గలేదు. రణ్ బీర్- ఐశ్వర్యారాయ్ కలిసి యే దిల్ హై ముష్కిల్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దీపావళికి రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రణ్‌బీర్, ఐష్‌ల మధ్య శృతిమించిన రొమాన్స్ సీన్స్ ఉన్నాయని.. వాటిని పరిమితి మేర ఉంచి.. కొన్నింటిని తొలగించినట్లు వార్తలొచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో రణ్‌బీర్‌ను తన తండ్రి అనుకుంది ఓ చిన్నారి. ఆమె ఎవరో కాదు. ఐశ్వర్య, అభిషేక్‌ల గారాలపట్టి ఆరాధ్య బచ్చన్‌. ఈ విషయాన్ని ఐష్‌ ఫిలింఫేర్‌ మేగజీన్‌ ఫొటోషూట్‌లో వెల్లడించింది. ఓసారి రణ్‌బీర్‌ అభిషేక్‌లాగే జాకెట్‌, క్యాప్‌ పెట్టుకుని ఉండడం చూసి అభిషేక్‌ అనుకుని రణ్‌బీర్‌ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుందని ఐష్ తెలిపింది. అంతేగాకుండా.. రణ్‌బీర్ ఎప్పుడు కనిపించినా ఓసారి అంకుల్.. మరోసారి ఆర్కే అంటూ సంభోదిస్తూ ఉంటుందని ఐష్ చెప్పుకొచ్చింది.