గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2023 (13:12 IST)

సినిమా హిట్టైనా ఫ్లాపైనా సమాజం బాగుకోసం చేసే నా ప్రయత్నం ఆగదు : వ‌రుణ్ తేజ్‌

Gandhivadhari Arjuna pre release
Gandhivadhari Arjuna pre release
వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ఈ మూవీని తెర‌కెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ మీద నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. 
 
ఈ సందర్భంగా నిన్న రాత్రి జరిగిన గాండీవధారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘నాకు హాలీడే అన్నా, పండుగ అన్నా కూడా మా పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజే. ఆయనకు అభిమానులందరి తరుపునా పుట్టిన రోజు శుభాకాంక్షలు. నా ఫస్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, నా చివరి దర్శకుడు అనిల్ రావిపూడి గారు, నా ప్రజెంట్ డైరెక్టర్ ఇదే స్టేజ్ మీదున్నారు. నన్ను నటుడిగా తీర్చి దిద్దిన ప్రతీ ఒక్క దర్శకుడికి థాంక్స్. వెరైటీ సినిమాలు తీసిన ప్రతీ సారి కమర్షియల్ సినిమాలు తీసుకోవచ్చు కదా? అని సలహాలు ఇస్తుండేవారు. కానీ కొత్త కథలు చేయడమే నాకు ఇష్టం. 
 
సినిమా హిట్టైనా ఫ్లాపైనా నా ప్రయత్నం ఆగదు. ఆడియెన్స్ సపోర్ట్ ఇంకా ఇలాంటి కొత్త కథలు చేస్తూనే ఉంటాను. సోషల్ మెసెజ్ ఉన్న సినిమాలు, అలాంటి కథలు అరుదుగా వస్తాయి. ఈ సినిమాలోని కోర్ పాయింట్ వల్లే ఒప్పుకున్నాను. ఎప్పుడూ మన కుటుంబం గురించి ఆలోచిస్తుంటాం. కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు సమాజం గురించి ఆలోచిస్తుంటాం. అలాంటి ఆలోచనల రావాలనే ఈ సినిమాను తీశాం. అవగాహన కల్పించాలనే ఈ చిత్రాన్ని తీశాం. నిన్న రాత్రే ఈ సినిమాను చూశాను. మంచి సినిమా తీశామనే ఫీలింగ్ వచ్చింది. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా నిర్మాత తొలిప్రేమతో నాకు మంచి లవ్ స్టోరీని ఇచ్చారు. విరూపాక్షతో హిట్ కొట్టారు. ఇప్పుడు ఈ సినిమాను తీశారు. టీం అంతా కూడా కష్టపడి పని చేసింది. నా మాటలు కాదు.. నా సినిమా, నా పని మాట్లాడాలి. ఆగస్ట్ 25న థియేటర్లోకి సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు చాలా జానర్లు టచ్ చేశాయి. చందమామకథలు, గరుడవేగ చాలా ఇష్టం. యాక్షన్ సినిమాలు తీసేటప్పుడు వచ్చే కిక్కే వేరు. ఎమోషన్స్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులతో ఈ సినిమాను తీశాను. గ్లోబల్ ఇష్యూ మీద ఈ సినిమాను తెరకెక్కించాను. ఎమోషన్‌ను జోడించి ఎంటర్టైనింగ్ యాక్షన్ జోనర్‌లో తీశాను. ఈ కథ రాయడం ఈజీగానే ఉంటుంది. కానీ ఇలాంటి కథను చేసే హీరో కావాలి. ఇది హీరో బేస్డ్ కథ కాదు. కథలో ఓ భాగంగా హీరో ఉంటాడు. కథ బాగుంది.. కథలో తన పాత్ర బాగుంటే.. సినిమాలు చేసే హీరో వరుణ్. అందుకే ఈ కథను ఆయనకు చెప్పాను. ఆడియెన్స్‌కు ఎక్కడా లోటు లేకుండా బడ్జెట్ పరిమితులతో తీయాలి. ఈ ఒత్తిడిలో 72 రోజుల షూటింగ్‌ను టీం అంతా కలిసి కష్టపడి 54 రోజుల్లో సినిమాను పూర్తి చేశాం. హీరో డెడికేషన్ వల్లే అది సాధ్యమైంది. దెబ్బలు తగిలినా కూడా షూటింగ్ చేశాడు. వరుణ్ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. ఈ సినిమాను మనసుతో చేశాను. నా మనసుకు నచ్చిన సినిమా. ఆగస్ట్ 25న ఈ చిత్రం రాబోతోంది. మా అందరినీ ఆడియెన్స్ ఆశీర్వదించాల’ని కోరుకున్నాను.
 
చి్త్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘వరుణ్ తేజ్‌తో మేం ఇది వరకు చేసిన తొలి ప్రేమ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన చరణ్ బాబుకు థాంక్స్’ అని అన్నారు.