భారతీయ చిత్రపరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే టాలీవుడ్ హీరో ఎవరు?
భారతీయ చిత్రపరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. వీరిలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్‌లతో పాటు అనేక చిత్రపరిశ్రమలకు చెందిన హీరోలు ఉన్నారు. అయితే, టాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా ఉన్నారు.
"బాహుబలి" విజయం తర్వాత కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. హీరోగా అంతకముందు నుంచి అతను ఉన్నప్పటికీ, ప్రభాస్‌ను స్టార్‌గా చేసి ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది బాహుబలి చిత్రమే. టాలీవుడ్ నటుడు అయినా బాలీవుడ్ ఖాన్లను మించిన క్రేజ్ ఇప్పుడతని సొంతం చేసుకున్నారు. గత పదేళ్ల కాలంలో ప్రభాస్ నేమ్ ఫేమ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ వస్తొంది.
పాన్ ఇండియా వైడ్ నటుడిగా క్రేజ్‌ను పొందటంతో పాటు వ్యకిగతంగా ఆస్తుల విలువ కూడా పెరిగింది. లగర్జీయస్ లైఫ్ స్టయిల్‌తో పాటు ఖరీదైన ఇళ్లు, కార్ల వరకు, ప్రభాస్ యొక్క నెట్‌వర్త్ ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారింది. ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ జాబితాలో ప్రభాస్ ప్లేస్ సంపాదించుకున్నాడు. గత 2024లో ప్రభాస్ నికర ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైగానే ఉంది.
నటుడిగా, ప్రభాస్‌కు ప్రధాన ఆదాయ వనరు సినిమాలే. రెమ్యూనిరేషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్థిరాస్తుల కోనుగోలుతో పాటు, తన స్నేహితులతో కలిసి సినిమాల నిర్మాణంలోనూ పెట్టుబడిగా పెడుతున్నారు. రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న తొలి హీరోగా ప్రభాస్ ప్రచారంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ రెమ్యూనిరేషన్ రూ.150 కోట్లు పైమాటే అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.
ప్రభాస్ ఆస్తులను పరిశీలిస్తే..
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పాష్ ఏరియాలో విలాసవంతమైన ఇంట్లో ప్రభాస్ నివాసం ఉంటున్నారు. విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో పాటు ఇంట్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్, గార్డెన్, హై-ఎండ్ జిమ్ ఉన్నాయి. ప్రభాస్ జిమ్‌లోనే 1.5 కోట్ల విలువైన పరికరాలు ఉన్నాయి. 84 ఎకరాలలో కూడిన ఫామ్ హౌస్ ప్రభాస్ సొంతం. ముంబైలో మరో ఇల్లు కూడా ఉంది. ఇటీవలే ప్రభాస్ యూరప్‌లో మరో ఇంటిని నెలకు రూ.40 లక్షల రూపాయలతో అద్దెకు తీసుకున్నట్టు సమాచారం. ఇక ప్రభాస్ గ్యారేజీలో లగ్జరీ కార్ల కలెక్షన్ ఎక్కువగానే ఉంది.
ఒక రూ.కోటి విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు.
రూ.60 లక్షల విలువైన ఆడి ఎ6 కారు.
రూ.2 కోట్ల విలువైన బిఎండబ్యు 7 సిరీస్ కారు
రూ.2 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కారు
రూ.ఒక్క కోటి విలువైన జాగ్వార్ ఎక్స్ జె ఎసల్ పోర్ట్‌ఫోలియో కారు
రూ.8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు అతని సొంతం.