సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 16 ఫిబ్రవరి 2019 (11:04 IST)

మార్చిలో రజనీకాంత్, నయనతార సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన మళ్లీ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుంది. సర్కార్ సినిమాతో సంచసల విజయాన్ని సాధించిన సంతోషంలో మురగదాస్ వున్నారు. పేట సినిమాతో హిట్ కొట్టిన రజనీకాంత్‌తో మురుగదాస్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో రజనీ సరసన నయనతార నటించనుందని టాక్ వస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకునే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 
 
ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా మరో హీరోయిన్‌గా నటించనుందని టాక్ వస్తోంది.  నయనతార ఎంపిక నిజమే అయితే, కథానాయికగా ఆమె 'చంద్రముఖి' తరువాత రజనీతో చేస్తోన్న సినిమా ఇదే అవుతుంది. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని టాక్ వస్తోంది.