Widgets Magazine

డ్రగ్స్ కేసు... రవితేజ విచారణ తేదీని ఎందుకు పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు?(వీడియో)

బుధవారం, 26 జులై 2017 (22:27 IST)

puri jagannath-Raviteja

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రోజుకో నిందితుడు అరెస్టవుతున్నాడు. ఇప్పటివరకూ 20 మందిని అరెస్టు చేశారు. మరోవైపు హీరో రవితేజను విచారించాల్సిన తేదీని ఇప్పటికే మూడుసార్లు మార్చారు. ప్రస్తుతం ఆయనను ఈ నెల 28న విచారించనున్నట్లు సమాచారం. ఐతే అసలు రవితేజ విచారణ తేదీని ఎందుకు మార్చుతున్నారన్న చర్చ జరుగుతోంది. మరింత కీలక సమాచారం వచ్చాక వాటితో రవితేజను విచారించాలని సిట్ భావిస్తోందా అనే వార్తలు వినబడుతున్నాయి.
 
ఇదిలావుంటే నెదర్లాండ్స్‌కు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ మైక్ కమింగాను మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ డీజి అకున్ సబర్వాల్ తెలియజేశారు. మరోవైపు సినీ నటి చార్మిని ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకూ విచారించారు. చార్మికి ముఖ్యంగా 4 ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.
 
గ్లామర్ కోసం కొద్ది మోతాదులో డ్రగ్స్ తీసుకునేవారంటూ ఆరోపణలున్నాయి. మీరు తీసుకుంటారా? డ్రగ్స్ పేరుతో డ్రగ్ ఫెస్టివల్స్ జరిగేవా... జరిగితే మీరు వెళ్లేవారా? కెల్విన్‌తో మీకు ఎప్పటి నుంచి పరిచయం వుంది? పూరీ జగన్నాథ్ డ్రగ్స్ తీసుకునేవారా? ఈ నాలుగు ప్రశ్నలను సంధించి ఆమె నుంచి సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా చార్మి రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సిట్ అధికారులు వెల్లడించారు.
 
ఇకపోతే డ్రగ్స్ కేసులో అరెస్టయిన కీలక నిందితుడుగా పేర్కొంటున్న 33 ఏళ్ల మైక్ కమింగా ఇప్పటివరకూ 4 సార్లు భారత్‌కు వచ్చినట్లు అకున్ సబర్వాల్ వెల్లడించారు. అతడి నుంచి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామనీ, మైక్ కమింగా వీసా గడువు 2018 వరకు ఉందని తెలిపారు. ఇతడి అరెస్టుతో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం వున్నట్లు ఆయన చెప్పారు. మరోవైవు ఈ కమింగా వుంటున్న అపార్టుమెంట్లోనే నటి చార్మి కూడా వుంటోందన్న వార్తలు వస్తుండటంతో ఇతడితో ఆమెకు డ్రగ్స్ వ్యవహారంలో ఏమయినా లింకులున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో...


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Drugs Interrogation Actor Raviteja

Loading comments ...

తెలుగు సినిమా

news

'ఫిదా' ఎందుకు హిట్టయ్యిందో తెలుసా?

చాలాకాలంగా ఒకే మూస ధోరణిలో సినిమాలకు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులు, ఇప్పుడు తమ అభిరుచిని ...

news

చార్మి 'జ్యోతిలక్ష్మి' ఏం చెప్పింది... డ్రగ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌లో వెలుగు చూసిన మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి చార్మీ వద్ద ...

news

కమల్ హాసన్, రజనీకాంత్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్: గౌతమి

సినీ లెజండ్ కమల్ హాసన్ ఇటీవల రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ...

news

'పియా మోరే.. మోరే' అంటూ ఊపేస్తున్న సన్నీ లియోన్ (Video Song)

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటిస్తున్న బాలీవుడ్ తాజా చిత్రం బాద్‌షాహో. ఈ చిత్రం సెప్టెంబర్ ...