బుధవారం, 5 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : గురువారం, 9 అక్టోబరు 2025 (14:07 IST)

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Srinidhi Shetty's forehead injury
Srinidhi Shetty's forehead injury
కథానాయిక శ్రీనిధి శెట్టి గురించి తెలియంది కాదు. బెంగుళూరుకు చెందిన ఈ భామ తెలుగు నేర్చుకుంది. కె.జి.ఎఫ్. షూటింగ్ లో వుండగానే ఆమె మేకప్ మెన్ లు, స్టయిలిస్ట్ లు హైదరాబాద్ వారు కావడంతో వారి నుంచి తెలుగు పదాలు నేర్చుకుని ప్రస్తుతం ఈజీగా తెలుగు మాట్లాడేస్తుంది. మొదటిలో ఆమెకు తెలుగు పదం నేర్చుకుందో ఏమిటో తెలుసా.. ఎధవ.. అని నేర్పారట. ఈ విషయం జోవియల్ గా చెబుతూ ఎంటర్ టైన్ చేసింది. 
 
ఇక  శ్రీనిధి శెట్టి నుదిటిపై ఓ గాటు వుంటుంది. అది తనకు చిన్నతనంలో వుండిందనీ, నాన్న, సోదరితో ఆటలాడుతుండగా అక్కడ దెబ్బ తగిలిందని చెబుతూ..ఇదంతా నిజంకాదు.. అసలు నిజం ఏమంటే, నాకు యాక్షన్ అంటే ఇష్టం. అలా కర్రలు, కత్తితో ఓసారి శిక్షణ తీసుకుంటుండగా ఎడమ కంటి పైన నుదిటమీద తాకింది. దాంతో పెద్ద గాయమైంది. అది కొన్నాళ్ళకు ఇలా గుర్తులా మిగిలిందని.. ఆ గాటును చూపించింది. అందుకే ఎప్పుడు ఏమిజరుగుతుందో మనకు తెలీదు. నేను ఇలా కె.జి.ఎఫ్. సీక్వెల్ లో చేస్తానని కానీ, నానితో హిట్ సినిమా చేస్తానని అనుకోలేదని చెబుతుంది. 
 
లేటెస్ట్ గా ఆమె సిద్దు జొన్నలగడ్డ తో కలిసి తెలుసు కదా అనే సినిమాలో నటించింది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చింది. సిద్ధు అన్ని క్రాఫ్ట్ లలో అనుభవం వున్న నటుడు అని చెప్పింది.