గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (16:09 IST)

చలనచిత్ర రంగములో మహిళలకు 30శాతం పెంచేందుకు ప్రతిజ్ఞ చేసిన ప్రముఖులు

supriya-sureshbabu
supriya-sureshbabu
భారతదేశపు అత్యంత ప్రియమైన వినోదాల గమ్యస్థానము, ప్రైమ్ వీడియో, ఈరోజు భారతీయ వినోద రంగములో మహిళల ప్రాతినిథ్యముపై భారతదేశపు అత్యంత ఖచ్ఛితమైన నివేదిక, "ఓ వుమనియా!" రిపోర్ట్ యొక్క తాజా సంచిక్ ను విడుదల చేసింది. మీడియా కన్సల్టింగ్ సంస్థ, ఆర్మాక్స్ మీడియా, భారతదేశపు ప్రముఖ వినోద జర్నలిజం వేదిక, ఫిల్మ్ కంపానియన్ ద్వారా పరిశోధించబడిన మరియు పర్యవేక్షించబడిన, మరియు ప్రైమ్ వీడియో ద్వారా ముందుకు అండిపించబడిన ఈ అధ్యయనము, భారతదేశపు వినోద పరిశ్రమలో కంటెంట్ నిర్మాణము, మార్కెటింగ్ మరియు కార్పొరేట్ నాయకత్వము యొక్క వివిధ కొణాలలో మహిళల ప్రయాణాన్ని అంచనావేసింది.

sobhu-sudha
sobhu-sudha
ఈ నివేదికకు మద్ధతుగా పరిశ్రమలోని ప్రముఖులు తమ మద్ధతును తెలిపారు మరియు వినోద రంగములో మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచుటకు ప్రతిజ్ఞ చేశారు. సుప్రియ యార్లగడ్డ, నిర్మాత & ఎక్సిక్యూటివ్ డైరెక్టర్, అన్నపూర్ణ స్టూడియోస్, “అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద, మేము తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ఐసిసి స్థాపించిన మొదటి స్టూడియో మరియు నిర్మాణ సంస్థ. మా నిర్మాణాల లో వైవిధ్యాన్ని ప్రోత్సహించుటకు మా ప్రయత్నాలను కొనసాగిస్తాము. రచయితల విభాగములో మహిళలను చేరుస్తాము. పనిప్రదేశములో మహిళలకు మద్ధతును ఇచ్చేందుకు మా వాతావరణము నిరంతరము ప్రయత్నిస్తుంది.” అన్నారు.

సుప్రియా మీనన్, భాగస్వామి, పృథ్విరాజ్ ప్రొడక్షన్స్ ఇలా అన్నారు, “నా ప్రాజెక్ట్స్ లో వైవిధ్యాన్ని ప్రోత్సహించడాన్ని నేను కొనసాగిస్తాను.” దగ్గుబాటి సురేష్ బాబు, నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ ఇలా అన్నారు, “నేను ఎప్పుడు నా ప్రాజెక్ట్స్ లో వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తాను.” శోభు యార్లగడ్డ, నిర్మాత, అర్క మీడియా వర్క్స్ ఇలా ప్రతిజ్ఞ చేశారు, “నా ప్రాజెక్ట్స్ లో వైవిధ్యాన్ని ప్రోత్సహించడం కొనసాగిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.” అపర్ణ పురోహిత్, హెడ్ ఆఫ్ ఒరిజినల్స్, ఇండియా & ఆగ్నేయాసియా, ప్రైమ్ వీడియో ఇలా వాగ్ధానం చేశారు, “రచయితల విభాగములో మహిళలను చేరుస్తానని మరియు మా నిర్మాణాలలో కనీసము 30% మహిళా హెచ్‎ఓడి’లు ఉండేలా కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.”