గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (16:22 IST)

సిద్ధు జొన్నలగడ్డ వాయిస్ ఓవర్ తో వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే

Bhag Saale producers with Sidhu Jonnalagadda
Bhag Saale producers with Sidhu Jonnalagadda
శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా కనిపించనుంది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో  క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే రిలీజ్ కు రెడీ అవుతోంది. 
 
ఈ సినిమా నుంచి తాజా అప్ డేట్ ను చిత్రబృందం వెల్లడించింది. వరల్డ్ ఆఫ్ భాగ్ సాలేను ప్రేక్షకులకు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పరిచయం చేయబోతున్నారు. ఆయన వాయిస్ ఓవర్ తో భాగ్ సాలే చిత్ర నేపథ్యాన్ని వివరించబోతున్నారు. కథలో హీరో ఎందుకు ఛేజింగ్ చేస్తున్నాడు, దాని వెనకున్న కారణాలు సిద్ధు వాయిస్ లో ఆసక్తికరంగా చెప్పబోతున్నాడు. భాగ్ సాలే ప్రపంచం ఎలా ఉండనుంది అనేది జూలై 7న థియేటర్స్ లో చూడాలని మూవీ టీమ్ కోరుతున్నారు.
 
నటీనటులు : శ్రీ సింహ కోడూరి, నేహా సొలంకి, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరాజన్, నందిని రాయ్, వైవా హర్ష, సత్య, సుదర్శన్, ప్రిథ్వీ రాజ్, ఆర్ జె హేమంత్, బిందు చంద్రమౌళి 
 
సాంకేతిక నిపుణులు : నిర్మాతలు : అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రణీత్ బ్రాహ్మాండపల్లి, ఛాయాగ్రహణం : రమేష్ కుషేందర్ , సంగీతం : కాల భైరవ , ఎడిటర్ : ఆర్.కార్తీక శ్రీనివాస్ , ఆర్ట్ డైరెక్టర్ : జే పి, ప్రొడక్షన్ డిజైనర్ :  శృతి  నూకల, ఫైట్ మాస్టర్ : రమ కృష్ణ , కొరియోగ్రాఫర్ : భాను, విజయ్ పోలకి , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అశ్వత్థామ, గిఫ్ట్సన్  కొరబండి, పీఆర్వో - జీఎస్కే మీడియా.