సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (12:51 IST)

అర్జున్ రెడ్డి గెటప్‌లో వరల్డ్ ఫేమస్ లవర్.. (Video)

అర్జున్ రెడ్డి గెటప్‌లో వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ కనిపించాడని టాక్ వస్తోంది. సెన్సేషనల్ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. విభిన్న చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ నాలుగు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో విజయ్ దేవర కొండ లుక్ అర్జున్ రెడ్డి తరహాలో వుంది. 
 
ఇక విజయ్‌కి జోడిగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసాబెల్లాలు నటిస్తున్నారు. టీజర్ విడుదలైన వెంటనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా సినిమాపై అంచనాలను పెంచింది. గోపీ సుందర్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై సీనియర్‌ నిర్మాత కేయస్ రామారావు నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని ఈ సినిమాను ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ టీజర్‌ను మీరూ ఓ లుక్కేయండి.