పొలం పనుల్లో బిజీ బీజీగా వున్న కేజీఎఫ్ స్టార్..
కేజీఎఫ్ స్టార్ యష్ పొలం పనుల్లో బిజీ బీజీగా వున్నాడు. తన సొంతూరు హసన్‌లో ఈ మధ్యనే యష్ వంద ఎకరాలు కొనుగోలు చేశాడని వీటి విలువ రూ.80 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వచ్చాయి.
ఈ మధ్యనే ఈ పొలం విషయంలో హీరో కుటుంబానికి, గ్రామస్తులకు మధ్య గొడవలు జరిగి విషయం జిల్లా కలెక్టర్ వరకు వెళ్లింది. సరే ఇప్పడా విషయాలను పక్కన పెడితే.. ఈ స్టార్ హీరో పొలంలో ఏం పండిస్తాడో చూద్దామంటే అక్కడక్కడ కొన్నిచెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు ఫోటోల్లో చూస్తే తెలిసిపోతోంది.
ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చామన్నది మరవకూడదు. ఆ మాటని మా హీరో తూచా తప్పకుండా పాటిస్తాడని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనమంటూ అభిమానులు వీటిని షేర్ చేసుకుంటున్నారు. ఇకపోతే.. కెజిఎఫ్-2 రిలీజ్‌కి రెడీగా ఉంది.
ప్రశాంత్ నీల్ డైరక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత యష్ ఏ దర్శకుడితో చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కన్నడ దర్శకుడు నర్తన్‌తో సినిమాకి హీరో యష్ కమిట్ అయ్యాడని వార్తలు వచ్చినా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.