శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జులై 2023 (22:50 IST)

"యాత్ర 2'' మోషన్ పోస్టర్ వీడియో

Yatra 2
Yatra 2
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా గురించి తెలిసిందే. శనివారం వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని 'యాత్ర' సినిమా సీక్వెల్ నుంచి ఆసక్తికరమైన పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ సీక్వెల్ మోషన్ పోస్టర్ వీడియోని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. 
 
మహి వి రాఘవ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' సినిమా 2019లో హిట్ అయ్యింది. ఇందులో వైఎస్సార్ పాత్రను మలయాళ నటుడు మమ్ముట్టి పోషించారు. 
 
తాజాగా యాత్ర సీక్వెల్‌కు రంగం సిద్ధం అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా 'యాత్ర 2' నుంచి మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ మోషన్ పోస్టర్ వీడియోలో డైలాగులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. 
 
మహి వి రాఘవ దర్శకత్వంలోనే యాత్ర 2 రిలీజ్ కానుంది. ప్రస్తుతం 'యాత్ర 2' మోషన్ పోస్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.