శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 29 ఏప్రియల్ 2021 (14:20 IST)

సన్నీలియోన్ ఏమి చెబుతుందో తెలుసా!

Sunny leoen photo
కోవిడ్ 19 గురించి స‌న్నీలియోన్ ఓ విష‌యాన్ని చెబుతోంది. కోవిడ్ మ‌హ‌మ్మారినుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌యం. అందుకు వేక్సిన్ వేసుకోవ‌డ‌మే మార్గం. వేక్సిన్ అనేది మ‌న అంద‌మైన జీవితానికి ఓ మార్గం. ప్ర‌తి ఒక్క‌రం వేక్సిన్ టీకా తీసుకుందాం. ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ యోధులకు మహమ్మారికి వ్యతిరేకంగా పోరాట అవకాశం ఇవ్వడానికి మీరే టీకాలు వేసుకోవ‌డానికి ముందుకు రండి. అంద‌మైన జీవితాన్ని గ‌డపండి. అంటూ ప్ర‌భుత్వానికి స‌పోర్ట్‌గా త‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే త‌ను టీకా వేసుకుందో లేదో అన్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు.
 
ఇటీవ‌ల త‌ర‌చూ త‌న గురించి త‌న సినిమాల గురించి ఎక్కువ‌గా సోష‌ల్‌మీడియాను వేదిక‌గా చేసుకుంది. ఇటీవ‌లే కేర‌ళ‌లోని ఓ అట‌వీ ప్రాంతంలో షూటింగ్ చేస్తుండ‌గా అక్క‌డ ఓ చెట్టు మొద్దుపై ఎక్కి, ఆ త‌ర్వాత అక్క‌డ‌నుంచి దుమికి ఆనందాన్ని అనుభ‌వించింది. జీవితంలో ఇలాంటి ఆనందాలు అనుభ‌వాలని ఈ సంద‌ర్భంగా చెప్పింది. సో. క‌రోనాను ఎదుర్కోవాలంటే అంద‌రూ వేక్సిన్ వేసుకుని మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుందాం అంటోంది.