శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (15:02 IST)

కొరటాల శివ, దిల్ రాజు ప్రారంభించిన యువ సుధ ఆర్ట్స్ కార్యాలయం

Koratala Siva, Dil Raju, Mikkilineni Sudhakar
Koratala Siva, Dil Raju, Mikkilineni Sudhakar
ప‌దిహేనేళ్ల‌కు పైగా ప‌లు విజ‌య‌వంతమైన చిత్రాల‌ను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూట‌ర్ సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు మిక్కిలినేని సుధాక‌ర్‌. ఇప్పుడు ఆయ‌న భారీ బ‌డ్జెట్ చిత్రాల నిర్మాత‌గా మారుతున్నారు.అందులో భాగంగా యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ ఆఫీసు ఆదివారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. మ‌న టాలీవుడ్ స్టార్స్‌తో ప‌లు భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించ‌బోతున్నారు.
 
Koratala Siva, Dil Raju, Mikkilineni Sudhakar and others
Koratala Siva, Dil Raju, Mikkilineni Sudhakar and others
ఈ ప్రారంభోత్సవంలో కొరటాల శివ, దిల్  రాజు, డివివి దానయ్య, పుల్లారావు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. కొరత శివ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటించనున్నారు. ఇందులో దిల్ రాజు కూడా పార్టనర్ కానున్నారు. త్యరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.