బన్నీపై మనసు పడిన చాణక్య హీరోయిన్..?

zareen khan
Last Updated: బుధవారం, 12 జూన్ 2019 (17:38 IST)
టాలీవుడ్‌ హీరోల్లో బెస్ట్ డ్యాన్సర్‌లో అల్లు అర్జున్ కూడా ఒకరు. అలాంటి అల్లు అర్జున్ డ్యాన్స్‌కు కేవలం టాలీవుడ్ సెలెబ్రిటీస్ మాత్రమే కాదు.. అటు బాలీవుడ్‌కు చెందిన సెలెబ్రిటీస్ కూడా ఫిదా అవుతున్నారు.


ప్రస్తుతం ఈ జాబితాలో జరీన్ ఖాన్ కూడా చేరిపోయింది. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ భామ ప్రస్తుతం గోపీచంద్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే తనకు ఇష్టమని చెప్పింది. దీని అర్ధం, ఎలాగో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి, పనిలో పనిగా టాప్ హీరోలకు గాలం వేస్తోందని టాక్ వచ్చినా.. స్టైలిష్ స్టార్ డ్యాన్స్ గురించి హీరోయిన్లు ప్రశంసించడం మామూలే కదాని సినీ జనం అనుకుంటున్నారు. 
 
ఇకపోతే.. గోపీచంద్ హీరోగా, జరీన్ ఖాన్, మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తున్న చాణక్య సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఇందులో గోపీచంద్ ఇండియన్ స్పైగా చేస్తున్నారు.


తాజాగా విడుదలైన ఈ సినిమా లుక్‌లో ముస్లిం కమ్యూనిటీ మధ్యలో గోపిచంద్‌ను హైలైట్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిపై మరింత చదవండి :