ఏం... ఎదురుతిరుగుతున్నాడా?
"మా వాడికి మార్కుల్లో ఎన్నిసార్లు సున్నాలొచ్చినా కొట్టడానికి వీలుకావడం లేదు" మొరపెట్టుకున్నాడు పోలీసు తోటి పోలీసుతో.
"ఏం? ఎదురుతిరుగుతున్నాడా?" అడిగాడు.
"కొట్టడానికి చేయెత్తినప్పుడల్లా జాతీయగీతం పాడుతున్నాడు. దాంతో సెల్యూట్ చేసి అటెన్షలో నిలబడాల్సివస్తుంది." చెప్పాడు పోలీసు.