శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By DV
Last Updated : శుక్రవారం, 15 జులై 2016 (13:24 IST)

'బాబు బంగారం' ఆడియో జులై 24, చిత్రం విడుదల ఆగ‌స్టు 12

విక్ట‌రీ వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్లో నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో, మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగవంశి, పి.డి.వి. ప్ర‌సాద్‌లు సంయుక్

విక్ట‌రీ వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్లో నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో, మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగవంశి, పి.డి.వి. ప్ర‌సాద్‌లు సంయుక్తంగా నిర్మించిన‌ చిత్రం 'బాబు బంగారం'. షూటింగ్‌ మొత్తం పూర్త‌యింది. జిబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్‌ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఆసాంగ్ చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం యూనిట్ అంతా హ్య‌ాపీగా వున్నారు. ఆడియోని జులై 24న విడుద‌ల చేసి, అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ఆగ‌స్టు 12న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడ‌ుదల చేస్తున్నారు.
 
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..."విక్ట‌రి వెంక‌టేష్, న‌య‌న‌తార కాంబినేష‌న్లో వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు మారుతి డైర‌క్ష‌న్‌లో మా బ్యాన‌ర్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పైన‌, ప్ర‌ముఖ నిర్మాత ఎస్‌.రాధాక‌ష్ణ(చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా బాబు బంగారం చిత్రాన్ని నిర్మించాము. దీనికి సంబంధించిన మెద‌టి లుక్ టీజ‌ర్ మ‌రియు సింగిల్ ట్రాక్‌కి విప‌రీతంగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి పాజిటివ్ బ‌జ్ వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా నిల‌వ‌టం చాలా హ్య‌ాపిగా వుంది. సౌత్ క్రేజి మ్యూజిక్ ద‌ర్శ‌కుడు జిబ్రాన్ అందించిన ఆడియోని 24న విడ‌ద‌ల చేసి, చిత్రాన్ని ఆగ‌ష్టు 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నాము. ఈ చిత్రం వెంక‌టేష్ గారి అభిమానుల‌తో పాటు ఫ్యామిలి ఆడియ‌న్స్‌ని చ‌క్క‌గా ఆకట్టుకుంటుంది" అని అన్నారు
 
ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేష్‌, న‌య‌న‌తార‌, షావుకారు జాన‌కి, బ్ర‌హ్మ‌ానందం, పోసాని కృష్ణముర‌ళి, పృధ్వి, జ‌య‌ప్ర‌కాష్‌, ర‌ఘుబాబు, బ్ర‌హ్మ‌ాజి, సంప‌త్‌, ముర‌ళీశ‌ర్మ‌, వెన్నెల కిషోర్‌, మున్నా వేణు, గిరిధ‌ర్‌, అనంత్‌, రాజార‌వీంద్ర‌, ర‌జిత‌, గుండు సుద‌ర్శ‌న్ న‌టించ‌గా.. డాన్స్‌- బృంద‌, శేఖ‌ర్‌; స్టంట్స్‌- ర‌వి వ‌ర్మ‌; ఆర్ట్‌- ర‌మ‌ణ వంక‌; ఎడిట‌ర్‌- ఉద్ద‌వ్‌.ఎస్‌.బి; పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను; సంగీతం- జిబ్రాన్‌; నిర్మాత‌లు- సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్‌; కథ-క‌థ‌నం-ద‌ర్శ‌క‌త్వం: మారుతి.