శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By DV
Last Modified: శనివారం, 14 నవంబరు 2015 (18:07 IST)

సోనీ పిక్చర్స్‌ స్పెక్టర్‌ జేమ్స్‌బాండ్ ‌007

భారీ బడ్జెట్‌ హాలీవుడ్‌ చిత్రాలను భారతదేశంలో విడుదల చేసే అగ్రగామి సంస్థ సోనీ ఫిక్చర్స్‌. ప్రతి ఏటా పలు విజయవంతమైన చిత్రాలను అందించే సోనీ పిక్చర్స్‌ నుండి వస్తున్న అత్యంత భారీ చిత్రం స్పెక్టర్‌ జేమ్స్‌బాండ్ ‌007. ప్రపంచ సినీ చరిత్రలోనే బాండ్‌ చిత్రాలకున్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. పిల్లల్నే కాదు పెద్దలను కూడా బాండ్‌ చిత్రాలు థ్రిల్‌ కలిగిస్తాయి. విపరీతమైన యాక్షన్‌ దృశ్యాలను చూడాలంటే ఈ బాండ్‌  చిత్రాలలోనే సాధ్యం. అలాంటి యాక్షన్‌ చిత్రాలను ఇష్టపడేవారు ఈ బాండ్‌ చిత్రాలను మిస్‌ కాకుండా చూస్తారు. ఇప్పటి వరకు 23 బాండ్‌ చిత్రాలు ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించాయి.
 
24వ బాండ్‌ చిత్రంగా వస్తున్న ఈ స్పెక్టర్‌ జేమ్స్‌బాండ్‌ 007 చిత్రం అత్యంత భారీ సన్నివేశలతో ఇప్పటివరకు చూడని అద్భుతమైన యాక్షన్‌ సీన్స్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబడిందని సోనీ పిక్చర్స్‌ అధినేతలు చెబుతున్నారు. ఇంగ్లడ్‌లో మొదలై ఇటలీ, ఆసియా, జెర్మనీ, మొరాకో ఇలా ఐదు దేశాల చుట్టూ తిరిగే యాక్షన్‌ చిత్రమిది. ఈ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలనే ప్రయత్నంలో  విధ్వాంసాలు సృష్టించే ముఠా నుండి మన హీరో జేమ్స్‌బాండ్‌ ఆ దేశలను ఎలా కాపాడాడన్నదే ఈ చిత్రం. బాండ్‌గా నాలుగోసారి ప్రపంచ ప్రేక్షకులను అలరించనున్నాడు డానియల్‌ క్రేగ్‌.
 
యాక్షన్‌ సీక్వెన్స్‌లో తనదైన ఫెర్‌ఫామెన్స్‌తో ప్రేక్షకులను మరోసారి అలరించనున్నాడు. 2005 నుండి 2015 వరకు బాండ్‌గా నటిస్తున్న డానియల్‌ క్రేగ్‌ 10 సంవత్సరాల బాండ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో వచ్చే ఓ లీడ్‌ యాక్షన్‌ సీన్‌కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని, ఆ సన్నివేశాలలో నటించేటప్పుడు చాలా రిస్క్‌ చేశానని, అలాంటి రిస్కీ యాక్షన్‌ చేసినప్పుడే నటుడుగా సంతృప్తి కల్గుతుంది, అలాంటివి ఈ చిత్రలో చాలా చేశాను అందుకే చాలా సంతృప్తిగా వున్నానని బాండ్‌ డానియల్‌ క్రేగ్‌ చెబుతున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో ఈ నెల 20న భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో అత్యధిక థియేటర్‌లలో స్పెక్టర్‌ జేమ్స్‌బాండ్‌ 007 విడుదలవుతోంది. జాన్‌లోగన్‌ రాసిన కథలో డానియల్‌ క్రేగ్‌, క్రిస్టోఫ్‌ వాల్డ్స్‌, లియా సీడోక్స్‌ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం- శ్యాం మేండోస్‌.