శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By DV
Last Modified: మంగళవారం, 17 మార్చి 2015 (19:36 IST)

ప్రపంచవ్యాప్తంగా మార్చి 27న గోపిచంద్ 'జిల్' గ్రాండ్ రిలీజ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి వంటి బ్లాక్‌బస్టర్‌తో తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం జిల్. లౌక్యం చిత్రంతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న గోపిచంద్ హీరోగా నటించగా రాశిఖన్నా హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జిల్ చిత్రాన్ని మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. 

 
ఇటీవలే ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేసిన ఆడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చింది. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హీరోయిన్ రాశిఖన్నా అందచందాలు, అభినయం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నాయి.  
 
మార్చి 27న జిల్ విడుదలవుతున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... గోపిచంద్ హీరోగా యూవి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించిన జిల్ చిత్రాన్ని మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ జిల్ చిత్రాన్ని రూపొందించాడు. గోపీచంద్ స్టైలిష్ పవర్‌ఫుల్ పెర్‌ఫర్మాన్స్ ఈ సినిమాకు హైలైట్. గోపిచంద్ ఈ తరహా పాత్రలో ఇప్పటివరకు కనిపించలేదు. గోపిచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకునే స్టామినా ఉన్న సినిమా ఇది. గోపిచంద్, రాశి ఖన్నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. గిబ్రాన్ అందించిన పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. రీ-రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 27న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని అన్నారు.    
 
నటీనటులు - గోపిచంద్, చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబి అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక వర్గం, పి.ఆర్.ఓ - ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను, కాస్ట్యూమ్ డిజైనర్ - తోట విజయ్ భాస్కర్, ఆర్ట్ డైరెక్టర్ - ఎ.ఎస్.ప్రకాష్, యాక్షన్ డైరెక్టర్ - అనిల్ అరసు, ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వర రావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి - శక్తి శరవణన్, మ్యూజిక్ - జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - ఎన్.సందీప్, ప్రొడ్యూసర్స్ - వి.వంశీ, ప్రమోద్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - రాధా కృష్ణ కుమార్