శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By DV
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2015 (16:00 IST)

ఆ వీడియో లీక్‌లు చూసి గొడవ చేయడం కరెక్ట్‌ కాదు... 'కీచక' దర్శకుడు

ఈ నెల 30న విడుదలకానున్న 'కీచక' చిత్రంపై కొందరు మహిళలు నిలుపదల చేయాలని గొడవ చేయడంపై చిత్ర దర్శకనిర్మాత చౌదరి గురువారం నాడు క్లారిటీ ఇచ్చాడు. యామిని భాస్కర్‌, జ్వాల కోటి, ప్రధాన పాత్రల్లో గౌతమి టాకీస్‌ పతాకంపై ఎన్‌.వి.బి.చౌదరి దర్శకత్వంలో కిశోర్‌కుమార్‌ పర్వతరెడ్డి నిర్మిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ కీచక. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని అక్టోబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్‌‌కు ముందుగానే సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోస్‌ లీక్‌ అయ్యాయనీ, అవి చూసి సినిమాను అంచనా వేయడం కరెక్ట్‌ కాదని దర్శకుడు చెబుతున్నాడు. 
 
ఎన్‌.వి.బి.చౌదరి మాట్లాడుతూ.. ఓ బర్నింగ్‌ ఇష్యూను తీసుకొని కొంతమందికి హెచ్చరికలా ఉండేలా సినిమా చేసాం. సినిమా వల్గారిటీగా ఉండదు కాని హార్ష్‌‌గా, వయిలెంట్‌‌గా ఉంటుంది. కొంతమందిని టార్గెట్‌ చేస్తూ చేసిన సినిమా. ఆడవాళ్ళను ఇన్స్పైర్‌ చేయడం కోసమే చేసాం. సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోలు చూసి మహిళా సంఘాలు మాపై దాడికి దిగాయి. వాళ్ళని సపోర్ట్‌ చేస్తూ మేము సినిమా చూసాం. కేవలం కొన్ని సన్నివేశాలు చూసి సినిమాను జడ్జ్‌ చేయడం సబబు కాదు. సెన్సార్‌ వారి నుండి కూడా మంచి స్పందనే వచ్చింది. 60 సెకన్లు సీన్లను, 5, 6 సన్నివేశాల్లో వాయిస్‌ కట్‌ చేసి అడల్ట్‌ సర్టిఫికేట్‌ ఇచ్చారు. నాగపూర్‌‌లో జరిగిన యదార్థ సంఘటన తీసుకొని ఫిక్షన్‌ జోడించి కథను సిద్ధం చేసుకున్నాను. నాగపూర్‌ వెళ్లి మూడు నెలలు పరిశోధన చేసానని చెప్పారు.
 
కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని 100 థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నాం. ఎక్కడైతే మహిళల అత్యాచారాలు జరుగుతున్నాయో అక్కడ మహిళలంతా ఒక్కటై ఎదిరిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాం. మహిళలను హింసించే విధంగా సినిమా చేయలేదు. వాళ్ళను ప్రోత్సహించే విధంగానే సినిమా ఉంటుంది.. అని చెప్పారు.