శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 26 ఆగస్టు 2014 (20:01 IST)

సెప్టెంబర్‌ 5న రవితేజ 'పవర్‌'

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌  ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కె.ఎస్‌.రవీంద్ర(బాబీ)ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పవర్‌'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్‌ 5న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోంది.
 
ఈ సందర్భంగా నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ - ''రవితేజ హీరోగా రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న 'పవర్‌' చిత్రం చాలా పవర్‌ఫుల్‌గా వచ్చింది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఫుల్‌లెంగ్త్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. డైరెక్టర్‌ రవీంద్ర చాలా అద్భుతంగా ఈ సబ్జెక్ట్‌ని హ్యాండిల్‌ చేసి ఒక పవర్‌ఫుల్‌ మూవీగా తీర్చిదిద్దారు. థమన్‌ అందించిన సంగీతం ఈ సినిమాకి చాలా ప్లస్‌ అవుతుంది. ఇప్పటికే ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. ముఖ్యంగా రవితేజ పాడిన 'నోటంకి.. నోటంకి' సాంగ్‌ సినిమాకే హైలైట్‌ అని చెప్పొచ్చు. త్వరలోనే ఈ ఆడియోకి సంబంధించి ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ చేయబోతున్నాం. అలాగే అన్ని కార్యక్రమాలు పూర్తి  చేసిన హండ్రెడ్‌ పర్సెంట్‌ సెప్టెంబర్‌ 5న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు.
 
దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) మాట్లాడుతూ - ''దర్శకుడుగా నా తొలి చిత్రమే ఇంత పెద్ద బేనర్‌లో మాస్‌ మహారాజా రవితేజగారితో చేయడం చాలా ఆనందంగా వుంది. రవితేజగారి ఎంకరేజ్‌మెంట్‌తో 'పవర్‌' చిత్రాన్ని మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాను. తప్పకుండా ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. థమన్‌ మ్యూజిక్‌ ఆల్రెడీ పెద్ద హిట్‌ అయింది. సెప్టెంబర్‌ 5న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రం ఆడియోని మించిన హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌ నాకు వుంది'' అన్నారు. 
 
ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, ముఖేష్‌ రుషి, సంపత్‌ రాజ్‌, అజయ్‌, సురేఖావాణి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మజీ, జీవా, సుబ్బరాజు, సప్తగిరి, కాశీ విశ్వనాథ్‌, జయలక్ష్మి, వినయ్‌ ప్రసాద్‌ తదితరలు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: జయనన్‌ విన్సెంట్‌, మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్క్రీన్‌ ప్లే: కె.చక్రవర్తి, మోహనకృష్ణ, ఆర్ట్‌: బహ్మకడలి, మాటలు: కోనవెంకట్‌, ఫైట్స్‌: రామ్‌ లక్ష్మణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: జె.జి.కృష్ణ, ఛీఫ్‌ కో డైరెక్టర్‌: ఎస్‌.సురేష్‌ కుమార్‌, నిర్మాత: రాక్‌ లైన్‌ వెకటేష్‌, కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు, దర్శకత్వం: కె.ఎస్‌.రవీంద్ర(బాబీ).