Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నానుంచి లేట్ కానివ్వను.. మీరే స్పీడ్ పెంచండి.. కాబోయే పెళ్లికూతురు అభ్యర్థన

హైదరాబాద్, శుక్రవారం, 16 జూన్ 2017 (08:24 IST)

Widgets Magazine

ఏం మాయ చేశావే అని నాగచైతన్యతో తొలి సినిమాలో అనిపించుకుని చివరకి అతడినే మాయ చేసి ఒడిలో వేసుకుంటున్న సమంతా రూత్ ప్రభు ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకుల కలలరాణి. కానీ అక్టోబర్ 6న చైతూతో వివాహబంధంలోకి వెళుతున్న తాను కమిట్ అయివున్న సినిమాలను సెప్టెంబర్ లోపే పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారు. తననుంచి ఏమాత్రం లేట్ కానివ్వనని, కానీ అక్టోబర్‌లో పెళ్లి జరుగుతున్నందున తాను నటిస్తున్న చిత్రాల్లో తన పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను మూడు నెలల్లో పూర్తి చేయాలని కోరుతూ ప్లీజ్‌ అర్థం చేసుకుని సహకరించండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారట.
manjima-naga chaitanya
 
చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు సమంత. తమిళంలో విజయ్‌తో ఒక చిత్రం, విశాల్‌కు జంటగా ఇరుంబుతిరై చిత్రాలతో పాటు అనీతి కథైగళ్‌ అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. అదే విధంగా తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తున్నారు. ఇవి కాకుండా తమిళంలో శివకార్తికేయన్‌తో జత కట్టడానికి అంగీకరించారు. వీటిలో ప్రస్తుతం విజయ్‌తో చేస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. కాగా శివకార్తికేయన్‌తో రొమాన్స్‌ చేయనున్న చిత్రం ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానుంది.
 
ఇన్ని చిత్రాల్లో నటిస్తున్న సమంత పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న తరుణంలో తాను నటిస్తున్న దర్శక నిర్మాతలకు ఒక విజ్ఞప్తి చేశారట. అదేమిటంటే తాను నటిస్తున్న చిత్రాల్లో తన పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను మూడు నెలల్లో పూర్తి చేయాలని కోరుతూ ప్లీజ్‌ అర్థం చేసుకుని సహకరించండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారట. అక్టోబర్‌ 6వ తేదీన పెళ్లి జరగనుండడంతో సెప్టెంబర్‌ కల్లా ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. 
 
వివాహానంతరం రెండునెలల పాటు సినిమాలకు దూరంగా ఆ జీవిత మాధుర్యాన్ని అనుభవించి ఆ తరువాత సమంత షరా మామూలుగా నటనపై దృష్టి పెడతారని సమాచారం. టాలీవుడ్‌ యువ నటుడు నాగచైతన్యతో సమంత ప్రేమ వ్యవహారం సక్సెస్‌ అయిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ వివాహం హిందూ, క్రిస్టియన్‌ల సంప్రదాయ పద్ధతిలో రెండు సార్లు జరగనుంది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రారంభ చిత్రంగా బాహుబలి 2

భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్మరణీయమైన రికార్డులను సాధించిన, నేటికీ సాగిస్తున్న బాహుబలి 2 ...

news

ఆప్త ఆధ్వ‌ర్యంలో మెగా బ్లడ్ డ్రైవ్-2017

మెగాస్టార్ చిరంజీవి 40 సంవత్సరాల సినిమా సేవలను కొనియాడుతూ చిరంజీవి రక్తదాన సేవలకు ...

news

మా హనీమూన్ ఎక్కడంటే : నోరు విప్పిన హీరోయిన్ సమంత

టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంత త్వరలోనే హీరో అక్కినేని నాగార్జున కోడలుకానుంది. ఈ టాలీవుడ్ ...

news

పూరీ అసిస్టెంట్ అలాంటివాడా? : అమ్మాయిని అన్ని విధాలుగా వాడేసుకున్న కేటుగాడు

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ పేరుతో ఓ కేటుగాడు ఓ యువతిని అన్ని విధాలుగా ...

Widgets Magazine