శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By DV
Last Modified: బుధవారం, 29 ఏప్రియల్ 2015 (20:22 IST)

డబ్బింగ్‌ చిత్రాల హవా... లయన్ రావడంలేదు... ఉత్తమ విలన్ వర్సెస్ గంగ

తెలుగు తెరపై మళ్ళీ డబ్బింగ్‌ సినిమాల హవా రాజ్యమేలుతుంది. పండుగరోజో, మరో ప్రత్యేకమైన రోజో అగ్రహీరోలు నటించిన చిత్రాలు విడుదలయితే.. చిన్న సినిమాలు ఆగిపోయేవి. ఇప్పుడు డబ్బింగ్‌ సినిమాల ధాటికి కొన్ని సినిమాలు వాయిదాపడ్డాయి. ఇంతకుముందు శంకర్‌ 'ఐ' చిత్రం విడుదల సమయంలో కొన్ని చిత్రాలు పోస్ట్‌పోన్‌ అయ్యాయి.

తాజాగా మేడే నాడు బాలకృష్ణ 'లయన్‌' విడుదల కావాల్సి వున్నా.. సాంకేతిక కారణాల వల్ల 8కి వెళ్ళింది. ఇక దొంగాట కూడా పోస్ట్‌పోన్‌ అయింది. రామోజీ రావు సినిమా 'దాగుడుమూత దండాకోర్‌', శ్రీకాంత్‌ నటించిన 'ఢీ అంటే ఢీ' మరో రెండు చిత్రాలు కూడా పోటీ నుంచి విరమించుకున్నాయి.
 
కమల్‌ హాసన్‌ ద్విపాత్రాభినయం చేసిన 'ఉత్తమ విలన్‌'తోపాటు రాఘవ లారెన్స్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ముని-2 (గంగ) రెండూ డబ్బింగ్ చిత్రాలు మే 1న విడుదలవుతున్నాయి. గంగ విడుదలకు అడ్దంకిగా ఉన్న సమస్యలను నిర్మాత బెల్లంకొండ సురేష్‌ పరిష్కరించినట్టు తెలుస్తుంది. టీవీలు, పత్రికలలో నిన్నటి నుండి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో తెలుగులో మంచి అంచనాలు ఉన్నాయి. ఉత్తమ విలన్‌ సంగతి సరే సరి. 
 
గెటప్‌‌లతో కమల్‌ క్రేజ్‌ తీసుకొచ్చారు. రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవడంతో చిన్న చిత్రాలు పోటి నుండి తప్పుకుంటున్నాయి. గంగ ఇప్పటికే తమిళంలో హిట్‌ కనుక తెలుగులో ఎలా వుంటుందో.. కమల్‌ సినిమా కూడా క్రేజ్‌ కనుక ఇది ఎలాగుంటుందోనని ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.