Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విజయ్ హీరోగా 'బాహుబలి' రైటర్ 'అదిరింది' దీపావళి విడుదల...

మంగళవారం, 17 అక్టోబరు 2017 (19:49 IST)

Widgets Magazine

గత దశాబ్దకాలంగా తమిళ హీరోలు మన తెలుగులో మార్కెట్ పెంచుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు, కానీ అందులో నటులు సూర్య, విక్రమ్, విశాల్, కార్తీ లాంటి వాళ్లు తమ సినిమాలను రెండు భాషల్లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. వీరు కొంతవరకు తమ మార్కెట్‌ను తెలుగులోనూ పెంచుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరికి ముందుతరం హీరోలైన కమల్‌హాసన్, రజనీకాంత్‌లు సైతం తమ సినిమాలను తెలుగులోనూ అనువదిస్తున్నారు. 
Vijay
 
ఇప్పుడు హీరో విజయ్ సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి గత కొంతకాలంగా గజనీ మహ్మద్‌లా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. కానీ లాభం లేకుండా పోయింది. 2011లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'స్నేహితుడు', మురుగదాస్ దర్శరత్వంలో వచ్చిన 'తుపాకీ', 'కత్తి', రాజు - రాణీ సినిమాల దర్శకుడు అట్లీ దర్శకత్వంలో వచ్చిన 'పోలీసోడు' సినిమా కూడా తెలుగులో నిరాశే మిగిల్చింది. 
 
కానీ ఈసారి దీపావళి కానుకగా అదే దర్శకుడితో 'అదిరింది' సినిమాను తీసుకొస్తున్నాడు. ఆ సినిమా రేపట్నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చాడు, బాహుబలి సినిమా రైటర్ 'విజయేంద్ర ప్రసాద్' ఈ సినిమాకు కథను అందించడంతో సినీ ప్రియుల అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ సినిమా ఎంతమేర విజయ్‌కి అదిరే హిట్టిస్తుందో చూడాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'అర్జున్ రెడ్డి' హీరోయిన్ అడిగినంత ఇచ్చేందుకు ప్రొడ్యూసర్స్ రెడీ

లిప్ టు లిప్ కిస్... ఈ కిస్ స్టిల్‌తో యూత్ హృదయాల్లో హీటెక్కించిన హీరోయిన్ అర్జున్ రెడ్డి ...

news

మహానటిలో కీర్తిసురేష్ ఫస్ట్‌లుక్.. ఆ కళ్లను దాచలేరంటూ... సమంత ట్వీట్

హీరోయిన్ కీర్తి సురేష్‌కు నేడు (అక్టోబర్ 17) పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహానటి సినీ యూనిట్ ...

news

బూతు డైలాగుల వల్లే సినిమాలు వదులుకున్నా: టాప్ కమెడియన్

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రకమెడియన్‌గా కొనసాగినవారిలో వేణుమాధవ్ ఒకరు. ఇటీవలి కాలంలో ఆయన ...

news

చెన్నైలో అట్టహాసంగా చైతూ-సమ్మూ రిసెప్షన్.. హైదరాబాదులో ఎప్పుడో?

హైదరాబాదులో టాలీవుడ్ కొత్త జంట నాగచైతన్య, సమంతల రిసెప్షన్ జరుగుతుందో లేదో అనేది ...

Widgets Magazine