శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By dv
Last Updated : గురువారం, 2 జూన్ 2016 (15:34 IST)

అందులో పవన్ కళ్యాణ్.. ఇందులో నితిన్.. 'అత్తారింటికి దారేది' ఫార్మెట్‌లోనే.. ''అ.. ఆ.."

త్రివిక్రమ్‌ సినిమా అంటేనే.. మాటలు, దర్శకత్వం కొత్తగా ఉంటుందని పేరుంది. 'జల్సా' నుంచి 'అత్తారింటికి దారేది'.. చిత్రం వరకు తన బాణీలో మెప్పించాడు. ఇక నితిన్‌ హీరోగా చేయడమంటే లవ్‌స్టోరీ అని అర్థమవుపోతుంద

నటీనటులు : నితిన్‌, సమంత, అనుపమ పరమేశ్వరన్‌, సీనియర్‌ నరేష్‌, రావు రమేష్‌, అజయ్‌, రఘుబాబు, గిరిబాబు, శ్రీనివాసరెడ్డి తదితరులు
సంగీతం : మిక్కీ జే మేయర్‌, నిర్మాత :  ఎస్‌. రాధాకృష్ణ, రచన, దర్శకత్వం : త్రివిక్రమ్‌.
 
విడుదల తేదీ : 02 జూన్‌, 2016
 
త్రివిక్రమ్‌ సినిమా అంటేనే.. మాటలు, దర్శకత్వం కొత్తగా ఉంటుందని పేరుంది. 'జల్సా' నుంచి 'అత్తారింటికి దారేది'.. చిత్రం వరకు తన బాణీలో మెప్పించాడు. ఇక నితిన్‌ హీరోగా చేయడమంటే లవ్‌స్టోరీ అని అర్థమవుపోతుంది. సమంత హీరోయిన్‌గా నటించడం ప్లస్‌ పాయింట్‌గా అనిపించింది. అయితే షూటింగ్‌ ఆరంభంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సరిగ్గా లేదని.. తప్పుచేశానేమోనని దర్శకుడు అన్నది నిజమోకాదో.. అంటే.. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పైగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సం రోజే నితిన్‌ తన సినిమాను విడుదలయ్యేలా ప్లాన్‌ చేసుకున్నాడు.
 
కథ : 
కోటీశ్వరురాలి ఇంటిలో పుట్టినా అనసూయ రామలింగం (సమంత) జీవితం రొటీన్‌, బోర్‌గా ఉంటుంది. తన మాటకు ఇంట్లో వాల్యూలేదు. అంతా అమ్మ చెప్పినట్లే వినాలి. లోకమే తెలీదు. అలాంటి స్థితిలో తనకిష్టంలేని సంబంధాన్ని ఆమె అమ్మ ఫిక్స్‌ చేస్తుంది. దాంతో జీవితంపై విరక్తికలిగి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత సేఫ్‌ అవుతుంది. దీనికి కారణం ఆమె తండ్రి రామలింగం (నరేష్‌). ఆమె తల్లి మహాలక్ష్మి (నదియా) బిజినెస్‌పని మీద వేరే ఊరు వెళితే.. ఆ సమయంలో తన కుమార్తెకు తండ్రి స్వేచ్ఛ ఇస్తాడు. ఆమె అత్త ఇంటివద్ద కొద్దిరోజులు గడపమని పంపిస్తాడు. ఆమె బావ ఆనంద్‌ విహారి (నితిన్‌) ఆమె ప్రయాణం సాఫీగా సాగేందుకు దోహదపడతాడు. 

 
అలా కొద్దిరోజుల్లోనే అనసూయ, ఆనంద్‌ విహారికి చాలా దగ్గరవుతుంది. ఇక.. ఆనంద్‌ విహారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం.. ఊరి పెద్ద పల్లం వెంకన్న (రావు రమేష్‌) కూతురు నాగవల్లి (అనుపమ) ఆనంద్‌ను ఇష్టపడటం జరిగిపోతాయి. తన కుమార్తెతో పెండ్లి నిశ్చయం అనుకున్న తరుణంలో వెంకన్నకు... ఆనంద్‌.. అనసూయ దగ్గరకావడం చూసి సహించలేకపోతాడు. దాంతో వెంకన్న కొన్ని ఎత్తులు వేస్తాడు. మరోవైపు మహాలక్ష్మి.. ఊరు నుంచి ఇంటికి వచ్చి అనసూయ పెండ్లిని ముందుగా అనుకున్న వ్యక్తితో ఫిక్స్‌చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వెంకన్న ఎత్తులు ఏమిటి? అనేది మిగిలిన సినిమా. 
 
పెర్‌ఫార్మెన్స్‌: 
ఇది పూర్తిగా సమంత బేస్ట్‌ మూవీ. ఆమె చుట్టూనే కథ తిరుగుతుంది. అమాయకత్వం, తెలివి కలగలిపిన నటన చేసింది. నటిగా మంచి పెర్‌ఫార్మెన్స్‌ పండించింది. అదేవిధంగా నితిన్‌.. సాధారణంగా తను చేయగలిగిన నటన చేశాడు. ఎగువ మధ్యతరగతి కుటుంబ బాధ్యతలు మోయాల్సిన యువకుడిగా నటన చాలా బాగుంది. రావు రమేష్‌ పాత్ర పాతదే అయినా భిన్నంగా నటన కనబర్చాడు. మళయాలి భామ అనుపమ పరమేశ్వరన్‌ చూడముచ్చటగా ఉంది. నరేష్‌, నదియా, ప్రవీణ్‌, ఈశ్వరి.. ఇలా అందరూ తమ పాత్ర పరిధిమేర నటించారు.
 
సాంకేతిక విభాగం : 
ఇది దర్శకుడి సినిమా. రచయిత కావడంతో సింపుల్‌ డైలాగ్‌లు ప్రాసలతో ఆకట్టుకున్నాడు. లోతైన సంభాషణలను అందరికీ అర్థమయ్యేలా చెప్పడం ఆయనకు ఈజీ. 'మట్టివాసనను.. ఆకాశం వర్షం రూపంలో స్ప్రే చేసినందనే.. చక్కగా చెప్పాడు. ఇలా కొన్ని సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌ పెద్దగా ఎఫెక్ట్‌ అనిపించదు. సెకండాఫ్‌లోనే కథేమిటి? ఎక్కడికి వెళుతుందనే చూడాల్సిందే. సంగీతపరంగా మిక్కీ జే మేయర్‌ అందించిన పాటలు ఒకే ఫార్మెట్‌లో ఉన్నా.. కథనంలో ఫర్వాలేదు అనిపిస్తాయి. సాహిత్యంలో ఎక్కడా ఆంగ్లపదం వాడలేదు. ప్రకృతి అందాలను పట్టించడంలో నటరాజన్‌ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ కీలకం. విజువల్స్‌లో డీటైలింగ్‌ను ఎక్కువ చూపించే త్రివిక్రమ్‌తో కలిసి నటరాజన్‌ చాలాచోట్ల మ్యాజిక్‌ చేశారు. ఇక కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్‌ బాగుంది. ఆర్ట్‌ వర్క్‌ బాగుంది. ఎస్‌.రాధాకృష్ణ నిర్మాణ విలువలూ బాగున్నాయి.
 
విశ్లేషణ: 
ప్రేమకథలు డీల్‌ చేయడం చాలా కష్టం. కత్తికి రెండు వైపులా పదునున్నట్టే ఎటు వెళ్ళినా.. ఒప్పించగలగాలి. అందుకు పరిణిత కావాలి. దర్శకుడు సున్నితమైన భావోద్వేగాలను, ప్రేమకథల్లో ఉండే కన్ఫ్యూజన్‌ను చాలా తెలివిగా చెప్పడంలో సక్సెస్‌ అయ్యాడు. పూర్తి స్థాయి ప్రేమకథలో, కుటుంబ బంధాలను కలిపి చెప్పడానికి ఏయే అంశాలు అవసరమో వాటన్నింటినీ త్రివిక్రమ్‌ పొందిగ్గా పొందుపర్చిన విధానం అబ్బురపరుస్తుంది. క్లైమాక్స్‌లో ఈశ్వరి చెప్పే చిన్న డైలాగ్‌ కానీ, ఇంటర్వెల్‌లో సమంత పాయింట్‌ ఆఫ్‌‍‌వ్యూలో అసలు కథను పరిచయం చేయడం కానీ, ఇలాంటివి రచయితగా త్రివిక్రమ్‌ చేసిన మ్యాజిక్కే! 
 
విలన్‌లోనూ హాస్యాన్ని జొప్పించి ఎంటర్‌టైన్‌ చేశాడు. సమంత అమాయత్వంలోనూ తను తన తల్లిని మోసం చేసి ఊరు వెళ్ళడం నుంచీ అంతా ఎంటర్‌టైన్‌గా మలిచాడు. అలా అనీ హృదయాన్ని పిండేసే సీన్లు లేవు అని కాదు కానీ.. అసలు పాయింటే.. 'అత్తారింటికి దారేది'.. తరహాలోనే... కొద్దిగా అటుఇటూ మార్చి తీసిన చిత్రమిది. పవన్‌ కళ్యాణ్‌ పాత్రను నితిన్‌ చేశాడంతే. కథలో కొద్దిగా మార్పు.
 
ఇదిలావుండగా, చెప్పే విషయాన్ని చాలా సున్నితంగా చెప్పినా.. నడత స్లోగా అనిపిస్తుంది. దాంతో  ఒక్కసారి చూసిన తర్వాత మరోసారి చూడాలన్నంత ఇందులో ఏమీ అనిపించదు. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు కనిపించాయి. ఇక త్రివిక్రమ్‌ సినిమాలన్నింటిలానే ఇందులోనూ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అక్కడక్కడా కథ స్థాయికి మించి, అసహజంగా కనిపించాయి. అలాగే సినిమా కూడా చాలా నెమ్మదిగా మొదలై అంతే నెమ్మదిగా మొదటి పది నిమిషాలు సాగుతుంది. చెప్పే పాయింట్‌ను విడమర్చి చెప్పకుండానే.. ప్రేక్షకుడి కోణంలో ఆలోచించేలా చెప్పడం త్రివిక్రమ్‌ స్టైల్‌.
 
ఇందులో సెకండాఫ్‌ అంతా కట్టె కొట్టేతెచ్చేట్లుగా వున్నా.. అర్థమయ్యేట్లుగానే వుంటుంది. హీరోహీరోయిన్ల పాత్రల్లో ఎక్కడా బేషజాలు లేకుండా పాత్రలను మలిచిన తీరుబాగుంది. ప్రేమలు, బంధాలు, అలకలు, అసూయలు అనేవి కామెన్‌. దాన్ని కొత్తగా చెప్పడంలో రచయిత ఎప్పటికప్పుడు కొత్తగా బయటకు వస్తుంటాడు. అ..ఆ.. లోనూ త్రివిక్రమ్‌ ఎప్పుడూ చేసే ఆ మ్యాజిక్‌ ఉంది. అత్తారింటికి దారేదిలోనూ.. పరువు సమస్యే. ఇందులోనూ అదే పాయింట్‌.. అక్కడ తండ్రీ కుమార్తె బంధంతో తీశాడు. ఇందులో అన్నా చెల్లి బంధంతో చుట్టాడు. సింపుల్‌ కథనే అంతే సింపుల్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు.
 
 
రేటింగ్‌ : 3/5