మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (10:58 IST)

"ఏ1 ఎక్స్‌ప్రెస్" ట్విట్టర్ రివ్యూ.. పక్కా కమర్షియల్.. తిరుగులేదు.. హిట్ బొమ్మ!

A1Express
''ఏ1 ఎక్స్‌ప్రెస్'' సినిమా శుక్రవారం విడుదలైంది. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రల్లో డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌కిషన్‌, దయా పన్నెం కలిసి నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా ఇది. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ మధ్య సరైన విజయాలు లేక సతమతమవుతోన్న సందీప్ కిషన్ ఈ సినిమాతో ఏలాగైనా హిట్ కొట్టాలనీ కసిగా ఉన్నాడు. 
 
ఇందుకు సందీప్ కిషన్ ఓ స్పోర్ట్స్ బ్యాగ్ గ్రౌండ్‌ను ఎంచుకున్నాడు. ఈ సినిమాకు చాలా వరకు పాజిటివ్ బజ్ ఉంది.. సోషల్ మీడియాలో చాలా వరకు అందరూ హీరో సందీప్ కిషన్‌కు పాజిటివ్ రిప్లై ఇస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ టీజర్‌లు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. 
 
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ అయిన "నట్పె తునై''కు తెలుగు రీమేక్‌గా వస్తోంది. అక్కడ ఈ సినిమా తమిళ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. మరి తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా రైట్ ట్రాక్‌లో దర్శకుడు తీసుకెళ్లాడని.. లవ్ ట్రాక్‌ను కథను బాగా నడిపాడని సినీ ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. సందీప్, లావణ్య, పోసాని, రావు రమేష్ నటన అదిరిపోయింది. పక్కా కమర్షియల్.. హిట్టు బొమ్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 
A1 Express
 
ఈ కథ విషయానికి వస్తే.. హాకీ ఆటకు సంబంధించిన ప్లేగ్రౌండ్ చుట్టూ ఉంటుంది. దాన్ని కాపాడుకునేందుకు ఓ కోచ్ చేసే ప్రయత్నం.. కోచ్‌కు తోడుగా ఆట నుంచి నిషేధింపబడ్డ ఓ ఆటగాడుగా సందీప్ కిషన్.. ఇలా ఆకట్టుకునే సీన్స్‌తో ఉంటుంది. ప్రేక్షకులు సందీప్, లావణ్య నటనకు ఫిదా అయ్యారు. ట్విట్టర్ రివ్యూ ఈ సినిమాకు పాజిటివ్‌గానే వచ్చింది. 
 
సందీప్ కిషన్ ఎందుకు హాకీ ఆట నుంచి బ్యాన్ చేయబడ్డాడు.. దీనికి గల కారణాలు ఏంటీ.. హీరో తిరిగి హాకీ స్టిక్ పడతాడా.. సందీప్ నటన ఎలా ఉంది. హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠీ ఎలా చేసింది. ఆమె రోల్ ఏంటీ.. కథ ఏ మాత్రం తెలుగు వారిని ఆకట్టుకుంటోంది.. ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.