Widgets Magazine

అంధగాడు రివ్యూ రిపోర్ట్: లవ్-కామెడీ కలబోసిన రివెంజ్ డ్రామా.. ఫుల్ టైమ్ పాస్..

శుక్రవారం, 2 జూన్ 2017 (16:20 IST)

Widgets Magazine
Raj tarun

సినిమా పేరు : అంధగాడు 
విడుదల తేదీ: జూన్ 2, 2017
నటీనటులు : రాజ్ తరుణ్, హెబ్బాపటేల్, రాజా రవీంద్ర, రాజేంద్రప్రసాద్, ఆశిష్ విద్యార్థి తదితరులు
దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్ నిర్మాత: రామబ్రహ్మం, అనిల్
 
చిన్న సినిమాల ద్వారా హిట్ సాధించే యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజాగా అంధగాడుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో హెబ్బాపటేల్‌తో మూడోసారి రొమాన్స్ చేశాడు. అంధుడిగా ఛాలెంజింగ్ రోల్ చేసిన రాజ్ తరుణ్ అంధగాడుకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. లవ్, కామెడీ కలబోసిన రివేంజ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. కథా రచయిత వెలిగొండ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కథా పరంగా రాజ్ తరుణ్ నుంచి అద్భుతమైన నటనను రాబట్టాడు. ఇక కథలోకి వెళ్తే.. కంటిచూపు వస్తే ప్రపంచాన్ని చూడాలనుకుంటాడు. ఈ క్రమంలో తనకు చికిత్స అందించే నేత్ర (హెబ్బాపటేల్) ప్రేమలో పడతాడు.
 
డాక్టర్‌గా నేత్ర రాజ్ తరుణ్‌కు కంటిచూపు వచ్చేలా ట్రీట్మెంట్ చేస్తోంది. ఈ ట్రీట్మెంట్‌లో ఆమె సక్సెస్ అవుతుంది. రాజ్ తరుణ్‌కు కంటిచూపు లభిస్తుంది. కానీ కళ్లు వచ్చిన తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సిన రాజ్ తరుణ్ ఎందుకు మర్డర్లు చేయాల్సి వచ్చింది? అందుకోసం ఎలాంటి డ్రామాలు ఆడాడు? ప్రేమించిన నేత్ర కోసం ఆమె తండ్రిని ఎలా మెప్పించాడు? అసలు రాజ్ తరుణ్ లక్ష్యం ఏమిటీ? అనే ప్రశ్నలకు సమాధానం లభించాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 
 
నటీనటులు: 
రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ నటన మెప్పించింది. పూర్తిస్థాయి విలన్‌గా రాజా రవీంద్ర మెప్పించాడు. కామెడీపరంగా రాజ్ తరుణ్‌తో కలిసి సత్య రవి మార్కు హాస్యాన్ని పండించాడు. షాయాజీ షిండే, రాజేంద్ర ప్రసాద్ తమ పాత్రలకు న్యాయం చేశారు. హెబ్బాపటేల్ డాక్టర్‌గా అదరగొట్టింది. కానీ నటనపరంగా ఇంకా మెచ్యూరిటీ కనిపించలేదు. డ్యాన్స్‌లు, డైలాగ్ సింక్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
గ్లామర్ తారగా ఫర్వాలేదనిపించింది. కంటి డాక్టర్‌గా సరిపోయింది. రాజ్ తరుణ్ సినిమా బాధ్యతలను తన భుజంపై వేసుకున్నాడు. గత చిత్రాల తరాహాలో కామెడీతో  హీరోగా అదరగొట్టాడు. ఎమోషన్ సీన్లలో అదరగొట్టాడు.  అంధుడి పాత్ర కోసం మరికొంత ఎక్సర్‌సైజ్ చేస్తే బాగుండేది. ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేసే అంధుడి పాత్రను కేవలం కామెడీ కోసం ఉపయోగించుకోవడం వల్ల సినిమాలో ఉండే ఎమోషన్స్ నీరుగారిపోయాయి. ఈ సినిమా వరకు రాజ్ తరుణ్‌ను ఎక్కడ తప్పు పట్టాల్సిన పనిలేదు. పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చాడు. కామెడీ విషయానికి వస్తే రాజ్ తరుణ్‌తో కలిసి సత్య రవి తన మార్కు హాస్యాన్ని పండించాడు. సాంకేతిక పరమైన వర్క్స్ ఆకట్టుకున్నాయి. రచయిత నుంచి దర్శకుడైన వెలిగొండ శ్రీనివాస్ సక్సెస్ అయ్యాడు. టెక్నికల్ పనులు మెరుగ్గా ఉన్నాయి.
 
హైలైట్స్
కథ
రాజ్ తరుణ్ 
ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ ప్లే
 
నెగిటివ్ పాయింట్స్
కథనం.. మాటలు, పాటలు
డైరెక్షన్ నిర్మాణ విలువలు
 
రేటింగ్ : 3 పాయింట్లు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మాపై అలాంటి పుకార్లొస్తే నవ్వుకునేవాళ్లం: హెబ్బా పటేల్, రాజ్ తరుణ్

రాజ్‌తరుణ్‌తో మూడోసారి జతకట్టిన హెబ్బా పటేల్.. పుకార్లపై స్పందించింది. వీరిద్దరి కాంబోలో ...

news

జూ.ఎన్టీఆర్ గడ్డం... మహేష్ బాబు లుంగీ... ఇదే చెర్రీ-సుక్కు చిత్రమా?

సుకుమార్ - రామ్‌చరణ్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్నట్టు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ...

news

టీవీరంగంలోకి రాకముందే అతనితో లవ్‌లో ఉన్నా.. నటించడం చాలా కష్టం బాబోయ్: లాస్య

యాంకర్ నుంచి యాక్టర్లుగా మారడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇప్పటికే అనసూయ, రష్మీ వంటి అందాల ...

news

కన్నబిడ్డనే కిరాతకంగా చంపేసిన తండ్రికి జీవిత ఖైదు.. తనకు పుట్టలేదని?

కన్నబిడ్డ మూగ, చెవిటితో పుట్టడంతో ఆ బిడ్డ తనకు పుట్టలేదని ఓ తండ్రి కిరాతకంగా చంపేశాడు. ఈ ...