మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (12:16 IST)

హింసకు పరాకాష్ట యానిమల్ సినిమా.. రివ్యూ రిపోర్ట్

Animal
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'యానిమల్'. యానిమల్'లో ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా ఉంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ అండ్ క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. 
 
ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల అయింది. మరి ఎలా ఉందో చూద్దాం.
 
కథ. 
ఇండియాలోనే టాప్ బిజినెస్ మాన్ అనిల్ కపూర్ కొడుకు రన్బీర్ కపూర్. నాన్న అంటే పిచ్చి ప్రేమ. కానీ చిన్న తనం నుంచి తండ్రి ప్రేమ దొరకదు. దాంతో ఓ సైకో లా బిహేవియర్ మారుతుంది. 
 
రణ్‍బీర్‌కు అక్క, చెల్లి వుంటారు. తనకు ఇష్టంలేని వాడిని అనిల్ కపూర్ అల్లుడు గా చేసుకుని అతన్నే నమ్మి వ్యాపారాలు చుసుకునేల చేస్తాడు. ఓ దశలో అనిల్ కపూర్ పై గన్ అటాక్ జరుగుతుంది. ఇది తెలిసి అమెరికాలో ఉన్న రన్బీర్ ఇండియా వచ్చి.. తండ్రిని ఎలా కాపాడాడు. ఈ క్రమంలో ఎన్ని సంగతులు జరిగాయి? రాష్మీక పాత్ర ఏమిటి.. అనేది సినిమా.
 
సమీక్ష.
సినిమా అంతా వైల్డ్‌గా ఉంటుంది. అర్జున్ రెడ్డిలోని హీరో పాత్రను రణ్‌బీర్ పాత్రలో దర్శకుడు చొప్పించాడు. అయితే అంతకుమించి సైకోలో ఉంటుంది. రొమాన్స్,  వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంది. రష్మీకతో కిస్, సెక్స్ సీన్స్, ఉన్నట్లే సెకండ్ ఆఫ్లో మరో అమ్మాయితో కూడా ఉంటుంది. 
 
అసలు ఈ స్టోరీని భారతంలో అన్నదమ్ముల కథగా చూపాడు. పూర్వం రాజుల యుద్ధంలో తలలునరకడం, బ్లడ్ పారడం వంటివి ఈ మధ్య kgf నుంచి ఎక్కువగా ఉంది. అలాంటి హింస ఇందులో కావాల్సినంత ఉంది.
 
నటన పరంగా రణ్‌బీర్ హైలెట్. చాలా షేడ్స్ కనిపిస్తాయి. ఇతర పాత్రలు బాగా సూట్ అయ్యాయి. కెమెరా, సంగీతం బాగానే ఉంది. 3 గంటల 25 నిమిషాల నిడివి ఉన్న సినిమా. దీనికి పార్ట్ 2 కూడా ఉందని ట్విస్ట్ ఇచ్చాడు.
 
ఇటీవలే రాజ మౌళి మాట్లాడుతూ, సినిమా ఫార్మెట్‌ను మార్చేసిన దర్శకుడు సందీప్ వంగా అని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే ఉంది. దేశంలో మిలియనీర్ ల కుటుంబంలో జరిగే విషయాలు, వాళ్ళ ఫ్యామిలీ సంగతులు చూపాడు. 
 
కామన్ మాన్‌కు పనికి రాని కథ. అందుకే సెక్స్, వైలన్స్ విపరీతంగా ఉన్నాయి. కత్తులతో కస కశ చంపటం, గన్ తో విపరీతంగా ప్రాణాలు తీయడం ఈ సినిమా సారాంశం.పిచ్చి ప్రేమ తండ్రి పై కొడుకు పెంచుకుంటే ఎలా ఉంటుంది అని తన స్టైల్‌లో సందీప్ చెప్పాడు.
 
సినిమా అంటే ప్రజలకు హాయి కలిగించాలి. కానీ జుగుప్స‌గా ఉండకూడదు.  ఫ్యామిలీ‌తో ఈ సినిమా కష్టమే. ముందు ముందు ఇలాంటి సినిమాలాను బాన్ చేసేలా సెన్సార్ బోర్డ్ రూల్స్ పెట్టుకోవాలని సినిమా చూసిన పలువురు విశ్లేషించారు.
 
రేటింగ్. 2/5