బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Modified: గురువారం, 14 నవంబరు 2024 (12:41 IST)

సూర్య నటించిన కంగువ ఎలా వుందో తెలుసా? రివ్యూ రిపోర్ట్

Suriya Kanguva
కంగువ నటీనటులు : సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, నటరాజన్ సుబ్రమణ్యం, కోవై సరళ, ఆనందరాజ్, K. S. రవికుమార్; సాంకేతికత: సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, నిర్మాతలు: కెఇ జ్ఞానవేల్ రాజా, ప్ర‌మోద్ ఉప్ప‌లపాటి, వి. వంశీ కృష్ణ రెడ్డి, దర్శకత్వం: శివ.
 
యాభై ఏళ్ళ సూర్యతో సిక్స్ ప్యాక్‌తో దర్శకుడు చేసిన సినిమా కంగువ. ప్రేమంటే ఇదేరా సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా చేసిన శివకు దర్శకుడిగా కంగువ పదో సినిమా. వెయ్యి ఏళ్ళ నాటి కథను ఈనాటి కాలానికి లింక్ చేస్తూ సూర్యను ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. నవంబర్ 14న విడుదలైన ఈ సినిమాఎలా వుందో చూద్దాం.
 
వెయ్యి ఏళ్ల రుణానుబంధం నేపథ్యంగా కంగువా కథ
1070 నాటి కాలం నుంచి 2024 వరకు సూర్య జీవితంలో జరిగే కథ. రష్యా సైంటిస్టులు పిల్లల బ్రెయిన్ పైన ప్రయోగాలు చేస్తారు. అందులో ఒక బాలుడు ఎస్కేప్ అవుతాడు. అతన్ని పట్టుకునేందుకు కొంతమంది తుపాకులతో గోవా వస్తారు. అప్పటికీ ఫ్రాన్సిస్ (సూర్య) పోలీసు అధికారికి మాఫియా వారిని ఏరికోరి పట్టించి డబ్బు తీసుకుంటాడు. అలాంటి టైంలో ఓ కుర్రాడు గోవాలో కలిసి ఫ్రాన్సిస్ ఆశీర్వాదం తీసుకుంటాడు. అతడి స్పర్శ, చూపు ఏదో తెలియని బంధం చూపిస్తుంది. ఆ తర్వాత 1070 నాటి కాలంలో ప్రణవకోణలో ఆదిమ జాతికి చెందిన నాయకుడు కంగువా(సూర్య) ఏవిధంగా ఓ కుర్రాడిని రక్షిస్తానని ప్రామిస్ చేస్తాడు. అలా కపాలకోన, సముద్రకోన, చీకటికోన జాతులు కంగువకు విలన్లుగా మారతాయి. ఇప్పటి ఫ్రాసిస్క్ లింక్ ఏమిటి అనేది మిగిలిన సినిమా..
 
సమీక్ష..
ఇది వెయ్యి ఏళ్ల జన్మల బంధంగా పాయింట్‌ను తీసుకొని శివ కథ రాసుకున్నాడు. అప్పటి కాలంలోకి తీసుకెళ్ళాడు. కపాలకోన జాతి నాయకుడు బాబీ డియోల్ క్రూరంగా కనిపిస్తాడు. బాహుబలిలో కాలకేయ జాతిగా ఉంటుంది. సినిమాలో అగ్రభాగం జాతుల మధ్య వైరుధ్యం, కుతంత్రాలు, పోరాటాలు,  రక్తపాతం కావల్సినంత ఉంది. చివరలో కపాలకోన నాయకుడుగా కార్తి ఎంట్రీ బాగుంది. ఈ సినిమాలో సిజి వర్క్ బాగుంది. నూతిలో ముసలి ఫైట్, విమానంలో ఫైట్.. హాలీవుడ్ సినిమాలను తలపిస్తాయి. 5 కోనలను అందంగా చుపించాడు కెమరామెన్. అడవులు కొండలు, లోయలు కనువిందుగా ఉన్నాయి.
 
ఐతే ఎక్కువభాగం ఆటవికులు అరుపులు, కేకలు, రక్తపాతంతో ఆడియెన్‌కు కాస్త బోర్ అనిపిస్తుంది. సూర్య రెండు పాత్రలు బాగా చేసాడు. దిశ గ్లామరస్‌గా కనిపిస్తుంది. యోగిబాబు ఫ్రాన్సిస్‌కు తోడుగా ఉంటాడు. ఐతే,, ఇలాంటి కథ ఇప్పటికి కాలంతో కొత్త లోకంలో చూపించే ప్రయత్నం మినహా ప్రేక్షకుడు ఎక్కడా కనెక్ట్ కాడు. కేవలం సూర్య ఒక్కడే కనెక్ట్ అవుతాడు. ఇది లోపం. దీనికి సీక్వెల్ కూడా ఉంది. మరి కేవలం పిల్లాడిని కాపాడతానని తనకు పుట్టకపోయినా, శత్రువు కొడుకుని పెంచి పోషించడం, ఆ కుర్రాడితో చావు దాకా వెళ్ళడం.. కథ లోపంగా అనిపిస్తుంది. మరి ఈసినిమాను ఎలా ఆదరణ పొందుతుందో చూడాలి.
 
రేటింగ్ 2.75/5