ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (16:06 IST)

ప్రశాంత్‌ కార్తీ నటించిన అనంత సినిమా ఎలా ఉందంటే.. రివ్యూ

Anantha movie
Anantha movie
నటీనటులు: ప్రశాంత్‌ కార్తీ, రిత్తిక చక్రవర్తి, అనీష్ కురువెళ్ళ, గెడ్డం శ్రీనివాస్, లయ సింప్సన్ తదితరులు
సాంకేతికత: సంగీతం: ఘంటశాల విశ్వనాథ్‌, నిర్మాత : ప్రశాంత్‌ కార్తీ, దర్శకత్వం: మదు బాబు తోకల
 
రామ్‌చరణ్‌ ‘ధృవ’, నితిన్ ‘చెక్‌’, రాంగోపాల్‌వర్మ ‘కొండా’ చిత్రాలలో నటించిన ప్రశాంత్‌ కార్తీ హీరోగా చేసిన సినిమా అనంత. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథగా చెప్పారు. మరి ఈరోజు విడుదల అయిన అనంత ఎలా ఉందో చూద్దాం. 
 
కథ: 
రాదేశ్(ప్రశాంత్‌ కార్తి) యూనివర్సీటీ ప్రొఫెసర్‌. హిస్టరీ సబ్జెట్ చెపితే అందరూ ఆసక్తిగా వింటారు.  అలాంటి తను పని చేసే యూనివర్సీటీ నుంచి వెళ్తున్న క్రమంలో  అతనికి వీడ్కోలు చెప్పడానికి  సైటిస్టులు ప్రద్యుమ్న( అనీష్ కురువెళ్ళ), ధర్మా(గెడ్డం శ్రీనివాస్), శృతీ(రిత్తిక చక్రవర్తి) తదితరులు రాదేశ్‌ ఇంటికి వస్తారు.  ఈ యూనివర్సీటీ నుంచి ఎందుకు వెళ్తున్నావని వారంతా  ప్రశ్నించడంలో కథ ప్రారంభం అవుతుంది. తాను  15 వేల సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి అని. ఎందరో ప్రముఖులను కలిశానని, కొలంబస్, బుధుడు వంటి వారితో ఉన్న అనుభవాలు  చెపుతాడు. తనకు మరణం లేదని . వయసు పెరగదని అంటాడు. ఈ చర్చలో రాధేశ్ కు ఎదో సైకా లాజికల్ సమస్య ఉందని కొందరు అంటే, ఒకరు మాత్రం సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. కాసేపటికి ప్రద్యుమ్న కూడా రావడంతో చర్చ డీప్ గా సాగుతుంది. ఆ తర్వాత ప్రద్యుమ్న భార్య చనిపోయిందని తెలుసుకుని ఆశ్చర్య పోతాడు  రాధేశ్. ఆమె కూడా తనకు తెలుసునని గతాన్ని చెపుతాడు. ఆసలు రదేశ్‌ ఎవరు? నిజంగానే అతను 15 వేల సంవత్సరాల క్రితం పుట్టాడా? ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ కు రదేశ్‌ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష: 
ఓ కొత్త అంశాన్ని తీసుకుని టైం ట్రావెల్ కథగా మార్చాడు దర్శకుడు. పురాణాల్లో దేవతలకు మరణం ఉండదు. అల్లాంటి పాయింట్ ఎంచుకున్నారు. ఇక్కడ ఒక సాధారణ కథలో అలాంటి పాత్ర పరిచయం చేయడం తొలిసారి. స్టార్ ట్రెక్ రచయిత జెరోం బిక్స్బీ రాసిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందులో పాత్రల తీరు ఆసక్తిగా ఉంటుంది. ఇక సినిమా పరంగా కొన్ని పరిమితులు ఉండటంతో అంత ఆసక్త్ గా ఉండాలంటే బడ్జెట్ సపోర్ట్ చేయాలి. కనుక చెప్పదలచింది సింపుల్ గా చెప్పారు. 
 
ప్రొఫెసర్‌కి వీడ్కోలు సంధర్భంగా అతని సహచరులు చర్చ గోష్ఠి లో చాలా ఆసక్తికర  విషయాలు ప్రేక్షకులను ఆకట్టు కుంటాయి. కానీ వాటిని కేవలం  మాటల్లో చెపుతారు. అదే విజువల్స్‌గా తెరపై చూపించి ఉంటే మరింత ఆసక్తికరంగా ఉండేవి. ఫస్టాఫ్‌ మొత్తం సైంటిస్టులు ప్రశ్నలు అడగడం.. ప్రొఫెసర్‌ జవాబు చెప్పడంతో పరిశోధనాత్మక చిత్రం గా అనిపిస్తుంది. ప్రేక్షకులకు కొంత జ్ఞానాన్ని అందిస్తాయి.  కథ ముగింపు లో ట్విస్ట్‌ బాగా చూపించారు. 
 
ఇంతకుముందు కొండా చిత్రంలో నక్సలైట్ నాయకుడు ఆర్కే రోల్ పోషించిన ప్రశాంత్ కార్తీ ఈ సినిమాతో ప్రొఫెసర్‌  రదేశ్ పాత్రలో వైవిధ్యంగా కనిపించాడు. డాక్టర్‌ ప్రద్యుమ్న పాత్ర లో అనీష్ కురువెళ్ళ, ధర్మా గా గెడ్డం శ్రీనివాస్ లు తమ సహజ నటనతో ప్రేక్షకులను అలరించారు. శృతిగా రిత్తిక చక్రవర్తి తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
 
ఇలాంటి సినిమాకు నేపథ్య సంగీతం ముఖ్యం. ఘంటశాల విశ్వనాథ్ సంగీతం బాగానే  అందించారు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సిద్దు సొంసెట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. కథ పరంగా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ఇలాంటి కొత్త ప్రయోగానికి మరింత ఎఫర్ట్ పెడితే బాగుండేది. రొటీన్ సినిమా కాకుండా సరికొత్త అంశాన్ని టచ్ చేసి దిశగా సాగింది. ఇందుకు నిర్మాత, హీరో ను అభినందించాల్సిందే. 
రేటింగ్: 2.5/5