శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 18 నవంబరు 2016 (15:46 IST)

నిజంగానే 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అంటూ పట్టేసే ఫిలిమ్... రివ్యూ రిపోర్ట్

అర్జున్‌ (నిఖిల్‌), వెన్నెల కిశోర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. తనలో మరో వ్యక్తి వున్నాడనీ.. వాడిని (ఆత్మ) బయటకు తేవాలంటే కేరళలోని మహిషాసుర మర్దిని ప్రాంతానికి వెళ్ళాలని కిశోర్‌ ప్రోద్బలంతో అర్జున్‌ వెళతాడు. అక్కడ కిశోర్‌కు మూడు రోజుల ట్రీట్‌మెంట్‌ జరుగు

ఎక్కడికి పోతావు చిన్నవాడా నటీనటులు : నిఖిల్‌, హెబ్బా పటేల్‌, నందిత శ్వేత, రాజా రవిచంద్ర, తనికెళ్ళభరణి, సత్య తదితరులు
సంగీతం : శేఖర్‌ చంద్ర, నిర్మాత : పి. వెంకటేశ్వరరావు, దర్శకత్వం : వివి ఆనంద్‌.
 
విడుదల తేదీ : నవంబర్‌ 18, 2016
వారం వారం సినిమాలు విడుదల ఒకరకమైతే.. మోడీ పుణ్యమా అని ఇప్పుడు వారంవారం సినిమాలు విడుదల చేయాలా! వద్దా! అనే అనుమానంతో విడుదల చేస్తున్నారు. పెద్దనోట్లకు గండిపడటంతో థియేటర్లు బోసిపోయివున్నాయి. అటువంటి తరుణంలో ప్రజలకు నోట్ల సమస్య కాస్త ఊరట ఇచ్చిందని అందుకే అనుకున్నట్లు ఈ శుక్రవారం విడుదల చేస్తున్నామని 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' హీరో నిఖిల్‌ వెల్లడించారు. 'స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య' వంటి భిన్నమైన కథల్ని ఎన్నుకున్న ఆయన ఈసారి ఆత్మ అనే కాన్సెప్ట్‌ను తీసుకున్నాడు. అప్పటికే 'టైగర్‌' సినిమా చేసిన అనుభవం వున్న ఆనంద్‌ను దర్శకునిగా తీసుకున్నాడు. వెరసి సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
అర్జున్‌ (నిఖిల్‌), వెన్నెల కిశోర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. తనలో మరో వ్యక్తి వున్నాడనీ.. వాడిని (ఆత్మ) బయటకు తేవాలంటే కేరళలోని మహిషాసుర మర్దిని ప్రాంతానికి వెళ్ళాలని కిశోర్‌ ప్రోద్బలంతో అర్జున్‌ వెళతాడు. అక్కడ కిశోర్‌కు మూడు రోజుల ట్రీట్‌మెంట్‌ జరుగుతుంది. ఈ మూడురోజుల్లో అర్జున్‌ కథ మారిపోతుంది. అక్కడ పరిచయమై ప్రేమ వరకు దారితీసిన అమల(హెబ్బా పటేల్‌) అస్సలు అమల కాదనీ, తను నిత్య అనే మరో అమ్మాయని తెలుస్తుంది. తన జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచనలో వుండగా తాను అమలననీ.. నీ ప్రేమ కోసం వస్తున్నానంటూ నందిత శ్వేత ఎంటరవుతుంది. అతను షాక్‌లో ఉండగానే నందిత శ్వేత ఇంటికి వచ్చేస్తుంది. అసలు అమల ఎవరు? ఇతన్నే ఎందుకు టార్గెట్‌ చేసుకుంది. అనేది మిగతా కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌:
నిఖిల్‌ ఇలాంటి పాత్రలు ఇంతకుముందు చేసినా.. తను చాలా ఈజ్‌తో చేసేశాడు. అమల పాత్రను పోషించిన నటి నందితా శ్వేతా నటన, పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఒక ఆత్మగా ఆమె చూపిన అభినయం బాగుంది. కీలక సన్నివేశాల్లో ఆమె హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. ఆమెపై నడిచే సన్నివేశాలు ప్రతిదీ ఆకట్టుకుంది. క్లైమాక్స్‌ రొటీనే అయినప్పటికీ అందులో నటనతో దానికి కాస్త కొత్తదనాన్ని తీసుకొచ్చింది నందితా శ్వేత. హీరో నిఖిల్‌, హెబ్బా పటేల్‌ల నటన కూడా ఆకట్టుకుంది. నిఖిల్‌ స్నేహితులుగా వెన్నెల కిశోర్‌, సత్య తదితరులు నవ్విస్తారు. ఇక మిగిలిన పాత్రలు ఓకే.
 
సాంకేతిక విభాగం :
దర్శకుడిగా ఇంట్రడక్షన్‌, ఇంటర్వెల్‌ థ్రిల్‌, సెకండాఫ్‌ కథనం, కామెడీని టైమింగ్‌లో వాడుకున్న తీరు బాగున్నాయి. చిత్రానికి ప్రధాన ఆకర్షణ శేఖర్‌ చంద్ర అందించిన బ్యాక్‌‌గ్రౌండ్‌ స్కోర్‌. సినిమాకి చాలా ఉపయోగపడింది. కీలకమైన సన్నివేశాల్లోని తీవ్రతను అది రెట్టింపు చేసింది. సాయి శ్రీరామ్‌ కెమెరా పనితనం చాలా బాగుంది. చోటా కె ప్రసాద్‌ ఎడిటింగ్‌ బాగుంది. ఇక నిర్మాత వెంకటేశ్వరరావు నిర్మాణ విలువలు బాగున్నాయి.
 
విశ్లేషణ:
దర్శకుడు ఆనంద్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ను వినోదంగా మలిచాడు. అందులో సక్సెస్‌ అయ్యాడు. మొదటి భాగమంతా సరదాగా ట్విట్ట్‌లతో సాగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌‌లో కథనాన్ని నడిపిన తీరు ఆకట్టుకుంది. ఆద్యంతం కథలో ఏదో ఒక థ్రిల్‌ వస్తూ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. రెండు భాగాల్లోనూ ఎంటర్‌టైన్‌ చేసేలా జాగ్రత్త తీసుకున్నాడు. వెన్నెల కిశోర్‌, సత్యలు టైమింగ్‌ ఉన్న పంచ్‌లతో మంచి ఎంటర్టైన్మెంట్‌ ఇచ్చారు.
 
ఆత్మలు, దెయ్యాలనే కాస్పెప్టులకు లాజిక్కులు వెతక్కూడదు. వెతికితే అంతా గందరగోళంగా వుంటుంది. ఎందుకంటే నిఖిల్‌ను ప్రేమించిన అవికాగోర్‌ చనిపోయి ఆత్మగా మారుతుంది. మరి ఆమెను పొందాలని ఆరాటపడుతూ ఆమెలాగే ప్రమాదంలో చనిపోయిన విలన్‌ ఆత్మగా మారడు. ఇలాంటివి కొన్ని తీసివేస్తే సరదాగా చూడతగ్గ సినిమాగా చెప్పుకోవచ్చు. మనిషి తీరని కోరికతో చనిపోతే దెయ్యంగా లేదా వేరే ఆత్మగా మారి వాటిని నెరవేర్చుకుంటాయి. ఇది అందరికీ తెలిసిన కథే. అలాంటి కథే ఈ సినిమా. ఇందులో ఇద్దరు హీరోయిన్లు వుండగా.. అసలు అమల పాత్రాధారి అవికాగోరే. క్లైమాక్స్‌కు దగ్గరగా వుండగా ఆ కథ రన్‌ అవుతుంది. ఇలా ముగ్గురు హీరోయిన్లతో థ్రిల్లర్‌ ఎలిమెంట్‌ను తీసుకుని తెరపై ఆవిష్కరించిన విధానం బాగుంది. 
 
కాగా, ఇంటర్వెల్‌ మధ్యలో ఆ తర్వాత సాగే నడక సాగదీసినట్లుంటుంది. అక్కడక్కడా వచ్చే వెన్నెల కిశోర్‌ కామెడీని మినహాయిస్తే ఇంటర్వెల్‌ పడే వరకూ ఎక్కడా రిలీఫ్ దొరకలేదు. దర్శకుడు ఆ భాగాన్ని ఆసక్తిగా రాస్తే బాగుండేది. అలాగే సెకండాఫ్‌ కథనంలో కూడా కాస్త బలం లోపించింది. క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ రొటీన్‌గా ఉంది. కార్తికేయ తర్వాత దాదాపు అన్ని కథలు అలాగే వచ్చాయన్న నిఖిల్‌ మరోసారి తన ప్రయోగాత్మకమైన ఫార్ములాను నమ్ముకుని చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. అయితే ఎక్కడా భయపడడానికి ఆస్కారం లేకుండా ఆత్మ ఫలానా పాత్రలో ప్రవేశించిందని తెలియడంతో ప్రేక్షకుడు థ్రిల్‌ పెద్దగా ఫీల్‌కాడు. సో.. మొత్తంగా ఏవరేజ్‌ సినిమా ఇది.
 
రేటింగ్‌ : 3/5