సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2017 (09:59 IST)

''గురు'' రివ్యూ రిపోర్ట్: ఫెయిల్యూర్ బాక్సర్‌‌ కోచ్ అయ్యాడు.. కూరగాయలు అమ్మే అమ్మాయిని బాక్సర్ చేశాడా?

"సాలా ఖండూస్‌" సినిమా తమిళంలో ఇరుది సుట్రుగా తమిళంలో రీమేక్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో అదే సినిమాను తెలుగులోనూ రీమేక్ చేశారు. తమిళం, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించిన సుధా కొంగర తెలుగు రీమేక్‌

సినిమా పేరు : గురు 
విడుదల తేదీ : మార్చి 31, 2017
దర్శకత్వం : సుధా కొంగర
నిర్మాత : ఎస్. శశికాంత్
నటీనటులు : వెంకటేష్, రితికా సింగ్
రేటింగ్ : 3.5
 
"సాలా ఖండూస్‌" సినిమా తమిళంలో ఇరుది సుట్రుగా తమిళంలో రీమేక్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో అదే సినిమాను తెలుగులోనూ రీమేక్ చేశారు. తమిళం, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించిన సుధా కొంగర తెలుగు రీమేక్‌ను కూడా డైరక్ట్ చేషారు. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘గురు’ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం (మార్చి 31)న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రివ్యూ ఎలా వుందో ఓసారి చూద్దాం..
 
కథలోకి వెళ్తే.. 
ఫెయిల్యూర్ బాక్సర్‌ ఆదిత్య (వెంకటేష్) ఎవ్వరినీ లెక్కచేయడు. ఇతనిని భారత మహిళా బాక్సింగ్ జట్టుకు కోచ్‌గా నియమిస్తారు. కానీ ఎవరినీ లెక్కచేయని తనం.. దూకుడు, కోపం వంటి ఇతరత్రా అంశాలు నచ్చని కొందరు ఫెడరేషన్ పెద్దలు అతన్ని ఢిల్లీ నుంచి వైజాగ్‌కు ట్రాన్‌ఫర్ చేస్తారు. అలా వైజాగ్ చేరుకున్న కోచ్ ఆదిత్య అక్కడే లోకల్‌గా కూరగాయలమ్ముకునే రామేశ్వరి (రితికా సింగ్)ని చూసి ఆమెలోని టాలెంట్‌ను గుర్తించి ఎలాగైనా ఆమెకు ట్రైనింగ్ ఇచ్చి తాను సాధించలేని కలను ఆమె ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటాడు. అయితే రామేశ్వరి మాత్రం అతని నిజాయితీని, తపనను గుర్తించదు. అలాగే ఫెడరేషన్‌లో ఉన్న శత్రువులు కూడా అతని ప్రయత్నాలను అడ్డుపడుతుంటారు. ఇన్ని అడ్డంకుల మధ్య ఆదిత్య రామేశ్వరిని ఎలా మారుస్తాడు? ఏవిదంగా ట్రైన్ చేస్తాడు? ఎలా వరల్డ్ ఛాంపియన్‌ను చేస్తాడు ? అనేదే ఈ సినిమా కథ.
 
ప్లస్ పాయింట్స్ :
విక్టరీ వెంకటేష్ నటన ప్లస్ పాయింట్ అయ్యింది. ఒక ఫెయిల్యూర్ బాక్సర్ ఎంత ఫ్రస్ట్రేషన్‌తో ఉంటాడు, అతను కోచ్‌గా మారితే తన శిష్యులను ఎలా ట్రీట్ చేస్తాడు, తన లక్ష్యం కోసం ఎలాంటి త్యాగాలను చెయ్యగలడు అనే అంశాలను చాలా బాగా చూపించారు దర్శకురాలు సుధా కొంగర. ఇక ఆ పాత్రలో వెంకీ నటించాడు అనడం కంటే జీవించాడని చెప్పొచ్చు. ఇక వెంకీ శిష్యురాలిగా రితికా సింగ్ నటన కూడా కొత్తగా బాగుంటుంది.
 
మైనస్ పాయింట్స్ :
సినిమాలోని మైనస్ పాయింట్స్ అంటే ముందుగా చెప్పాల్సింది సెకండాఫ్. పాత్రల మధ్య ఎమోషన్‌ను పండించడానికి కాస్త కథనం సాగదీసినట్టు అనిపిస్తుంది. రితికా సింగ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఎదిగే విధానాన్ని ఇంకాస్త ప్రభావంతంగా చూపించి ఉండాల్సింది. అలాగే జూనియర్ కోచ్‌గా నాజర్ పాత్ర కాస్త అతిగా ఉండి కొన్ని చోట్ల మొహమాట పెట్టింది. ఇక క్లైమాక్స్ ఫైట్‌ను బాగానే డిజైన్ చేసినప్పటికీ అందులో వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌కు ఉండాల్సిన ఉత్కంఠ లోపించింది. 
 
సాంకేతిక విభాగం :
‘గురు’ చిత్రం కథ, కథనాలు, ప్రధాన పాత్రల చిత్రీకరణ పరంగా చాలా బలంగా ఉంది. దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించారు. వెంకీని సరికొత్తగా చూపడంలో ఆమె పూర్తిగా సక్సెస్ అయ్యారు. శక్తివేలు సినిమాటోగ్రఫీ బాగుంది. సంతోష్ నారాయణన్ పాటలకు అందించిన సంగీతం, కీలక సన్నివేశాలకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. వెంకీ పాత్రకు రాసిన డైలాగులు పాత్ర స్వభావాన్నితగ్గట్టు చాలా బాగున్నాయి. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. సతీష్ సూర్య ఎడిటింగ్ కూడా బాగుంది. మొత్తానికి గురుగా వెంకీ అదరగొట్టేశాడు. సినిమా టోటల్‌గా మంచి పాజిటివ్ మార్కులు కొట్టేసింది. దీంతో డీసెంట్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా అదుర్స్ అనిపించింది.