శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (21:50 IST)

ధృవ వాయు నటించిన దర్శకత్వం వహించిన కళింగ మూవీ రివ్యూ

Kaling poster
Kaling poster
నటీనటులు: ధృవ వాయు, ప్రగ్యా నయన్, తనికెళ్ల భరణి,  లక్షణ్ మీసాల, ఆడుకాలం నరేన్, బలగం సుధాకర్, మురళీధర్ గౌడ్, తదితరులు
 
సాంకేతికత:  సినిమాటోగ్రఫర్: అక్షయ్ రామ్ పొదిశెట్టి, మ్యూజిక్: విష్ణు శేఖర,  నిర్మాత:  దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్,  దర్శకత్వం: ధృవ వాయు
 
 'కిరోసిన్' అనే మూవీతో పరిచయం అయిన నటుడు ధృవ వాయు. ఈసారి తనే దర్శకుడిగా మారి కళింగ అనే సినిమా చేశాడు. ఇప్పటికే ఈ సినిమాను పలు చోట్ల ప్రీమియర్స్ వేశారు. 13వ తేది విడుదల కాబోతున్న ఈ చిత్రం నేడు విలేకరులకు ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. 
 
కథ: 
కళింగ అనే ఊర్లో మొదలవుతుంది. అక్కడ లింగ (ధృవ వాయు) ఊర్లో సారాయి కాస్తూ జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఊరిలో అసుర అనే శక్తి ప్రజలకు భయపెట్టిస్తుంది. దీనిపై ఓ గ్రంథాలను చదివి తెలుసుకుంటాడు. పద్దు (ప్రగ్యా నయన్)ను ప్రేమించి లింగ పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత తనకున్న రెండు ఎకరాల పొలాన్ని ఊరికి పెద్ద అయిన (ఆడుకాలమ్ నరేన్) దగ్గర తాకట్టు పెడతాడు. కొంతకాలానికి పొలాన్ని విడిపించుకొనేందుకు లింగ వెళితే, అతని రెండు ఎకరాలతోపాటు ఊరి పెద్దకున్న రెండు ఎకరాలు కూడా లింగకు ఇచ్చేస్తాడు. ఊరిపెద్ద ఇచ్చిన రెండు ఎకరాల్లోనే అసుర అనే రాక్షసి వుంటుంది. అన్నీ తెలిసిన లింగ ఏమి చేశాడు? ఆ రాక్షసిని కంట్రోల్ చేశాడా? లేదా? అనేది మిగిలిన సినిమా.  
 
సమీక్ష:
కథ  చాలా ఆసక్తికరమైన పాయింట్ తో వుంటుంది. చాలామటుకు తనకు సాధ్యమైనరీతిలో దర్శకుడు చెప్పగలిగాడు. మరి కాస్త కసరత్తు చేస్తే చిత్రం భారీ రేంజ్ లో వుండేది.  మొదటి భాగం చాలా ఆసక్తిగా సాగుతుంది. ధృవ వాయు  ఈ సినిమాలో హీరోగా నటిస్తూ తనకు ఎలాంటి సబ్జెక్ట్ సూట్ అవుతుందో అలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు. ఒక డిఫరెంట్ స్టోరీని రాసుకొని తెరపై అంతే అద్భుతంగా ఎక్స్ క్యూట్ చేసాడు. 
 
ఈ కథకు రీరికార్డింగ్ చాలా కీలకం. దానిని సంగీత దర్శకుడు చక్కగా పండించాడు. బీజియమ్ అద్భుతంగా వుంది. అదే సినిమాను నిలబెట్టింది. కథలో ఊరికి ఉన్న శాపం. ఊరి పొలిమేర దాటితే కలిగే అనర్ధాలను చక్కగా ప్రెజెంట్ చేసాడు. ముఖ్యంగా ఊరు సరిహద్దులు దాటిన వాళ్లు ఎందుకు చనిపోతున్నారు. దాని వెనక ఏదైనా అతీత శక్తులున్నాయా అనేది ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా చేశాడు. 
 
నటుడే దర్శకుడిగా మారితే.. ఎలా ఉంటుందో 
 
ధృవ వాయు తన నటనతో పాటు దర్శకుడిగా బాగానే చేశాడనే చెప్పాలి. తనకున్న పరిమితుల మేరకు చేసినట్లుంది. కాకపోతే ఇంకాస్త కసరత్తు చేసి వుంటే స్క్రీన్ ప్లే పరంగా కొన్ని ట్విస్ట్ లు వుండేట్లుగా చేస్తే భారీ సినిమా అయ్యేది. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి.  హీరోయిన్ గా నటించిన ప్రగ్యా నయన్ పర్వాలేదు. విలన్స్ తమ విలనిజాన్ని మరింతగా చేస్తే బాగుండేది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.
 
నిర్మాణ పరంగా విలువలు బాగున్నాయి. మర్డర్ మిస్టరీ కనుక కథ ఇంటర్వెల్‌కు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుంది. సెకండాఫ్‌లో మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటే బాగుండేది. అయితే ఈ సెకండాఫ్‌కు ప్రధాన బలం.. చివరి 20 నిమిషాలు. వీఎఫ్ఎక్స్‌తో ఆకట్టుకుంటారు. వాటిని చూస్తే ఈ మధ్య వచ్చి కాంతార, విరూపాక్ష, హనుమాన్ చిత్రాలు కూడా గుర్తుకు వస్తాయి. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని ఇటీవలే ప్రీ రిలీజ్ వేడుకలో పలువురు ప్రముఖులు తెలిపారు. ఇది యూత్ కు కనెక్ట్ అయితే బాగా రీచ్ అవుతుంది. చిన్నపాటి లోపాలున్నా అవి కనిపించకుండా చేశారు. 
 రేటింగ్ : 3/5