సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (13:15 IST)

కమల్ కామరాజు నటించిన సోదర సోదరీమణులారా మూవీ ఎలావుందంటే! రివ్యూ

Kamal Kamaraju, Aparna Devi
Kamal Kamaraju, Aparna Devi
నటీనటులు:కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో, కాలకేయ ప్రభాకర్, పృథ్వీ తదితరులు 
 
సాంకేతికత:  సినిమాటోగ్రఫీ : మోహన్ చారి, నేపథ్య సంగీతం : వర్ధన్, ఎడిటర్ : పవన్ శేఖర్ పసుపులేటి, నిర్మాత : విజయ్ కుమార్ పైండ్ల, రచన, దర్శకత్వం : రఘుపతి రెడ్డి గుండా
 
పలు చిత్రాలలో నటించి పేరు తెచ్చుకున్న కమల్ కామరాజు లేటెస్ట్ గా చేసిన సినిమా సోదర సోదరీమణులారా. అపర్ణాదేవి ఆయన భార్య గా నటించింది.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వినాయక చవితి సందర్భంగా 500 థియేటర్ల లో సెప్టెంబర్ 15న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. 
 
కథ
 
రాజు (కమల్ కామరాజు) కామన్ మాన్.  శ్రావణి (అపర్ణాదేవి)ని ప్రేమ వివాహం చేసుకుని సిటీకి వస్తాడు. క్యాబ్ డ్రైవర్ గా జీవనం సాగిస్తాడు. కూతురు మహాకూడా తోడుకావడంతో ఖర్చులు పెరుగుతాయి. మరోవైపు  క్యాబ్ లోన్ కట్టడానికి కష్టపడుతుంటాడు. ఓరోజు పరిస్టుతులవల్ల చికాకుగా బయటకు వెళ్లిన రాజుకు ఉరి చివరన ఉన్న రిసార్ట్ కు డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఆశతో  లేట్ నైట్ లో  సన్నీ అనే వ్యక్తిని తీసుకెళతాడు. అక్కడ జరిగిన నాటకీయ పరిణామాలతో ఓ హత్య కేసులో రాజును పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. మరి కారులో ఉన్న సన్ని ఏమైనాడు? అసలు రిసార్ట్ లో ఏమి జరిగింది? రాజు అరెస్ట్  వెనుక ఎవరు ఉన్నారు? సోదర సోదరీమణులారా అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
 
సమీక్ష:
ఈ సినిమా చూస్తే సమాజంలో జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా జరిగింది అని తెలుస్తోంది. వినోదంకోసం కాకుండా ఓ ఆలోచనతో సమాజాన్ని జాగృతి చేసేవిధంగా సినిమా రావడం అరుదు. తొలిసారిగానే అటువంటి ప్రయత్నం చేసాడు దర్శకుడు  రఘుపతి రెడ్డి గుండా. సోషల్ అవేర్ నెస్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన దర్శకుడు స్నేహితుల సహకారంతో చిన్న చిత్రంగా మలిచాడు. సమాజంలో పోలీస్ వ్యవష్ట, రాజకీయ వ్య్వవస్థకు లింక్ చేస్తూ వాస్తవానికి దగ్గరగా తీసాడు. సన్నివేశాలపరంగా ట్విస్ట్ లు ఉండేలా చేసినా దాన్ని మరింత ఆకర్షణీయంగా రాసుకుంటే బాగుండేది. బయట కొందరు మనుషులు ఎలాఉన్నారనే పాత్రలు ఇందులో ఉన్నాయి. ప్రధానంగా టీ బంక్ నడిపేవాడు, ఏ  పని చేయకుండా తల్లి పించన్ పై బతికే వాడు, ప్రమోషన్ కోసం ఎటువంటి  తప్పు అయినా చేసే పోలీస్ అధికారులు, పరపతి కోసం ప్రాకులాడే మంత్రులు వీరంతా మనముందు కనిపిస్తారు. 
 
ఇక,  సగటు మనిషిగా అమాయకపు  క్యాబ్ డ్రైవర్ రాజు పాత్రలో  కమల్ కామరాజు అమరాడు. రాజు భార్య గా నటించిన శ్రావణి (అపర్ణాదేవి) అంతే విధంగా నటించింది.  తెరపై వీరిద్దరి జోడీ చాలా క్యూట్ గా ఉంది. హోం మినిస్టర్ గా సీనియర్ నటుడు పృద్వి నెగటివ్‌ షేడ్‌ లో ఆకట్టుకున్నాడు. సి. ఐ భాస్కర్ పాత్రలో బాహుబలి ప్రభాకర్ చక్కటి ప్రదర్శన చూపించాడు. తనపై అధికారి గా యస్. పి పాత్రలో వెంకటేశ్వర్ రావు చాలా బాగా నటించాడు. సీనియర్ కానిస్టేబుల్ గా స్టేజీ, సినిమా నటుడు పద్మారావు పాత్ర బావుంది. మిగిలిన వారు పాత్రమేరకు నటించారు. 
 
- పాటలు  లేకుండాదర్శకుడు  కంటెంట్ పై నమ్మకంతో ఎమోషనల్, హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా కథను ఎంచుకుని  క్యూరియాసిటిని కలిగించాడు. కెమెరా, సంగీతం పర్వాలేదు. పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటింగ్ తన కత్తెరకు ఇంకొంచెం పని చెప్తే బాగుండేది. కథ పరిమితి మేరకు  నిర్మాణ విలువలు బాగున్నాయి. అన్ని వర్గాల వారిని అలరించే విధంగా తెరకెక్కిన ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం "సోదర సోదరీమణులారా...' ఈ సినిమా చక్కటి సందేశంతో ఫీల్ ను కాగిగించేదిగా ఉంది. ఓ.టి.టి.కి మంచి కంటెంట్ సినిమా ఇది. 
రేటింగ్: 2.5/5