గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (18:53 IST)

'లైగర్' రివ్యూ.. 3 స్టార్స్ ఇచ్చేశారుగా... విజయ్ వన్ మేన్ షో!

liger
'రౌడీ' హీరో అభిమానులకు శుభవార్త వచ్చేసింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజాగా తెలుగు సినిమాలకు రివ్యూ ఇచ్చే ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు 'లైగర్‌'కి కూడా రివ్యూ ఇచ్చేశాడు. విజయ్‌ దేవరకొండ సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకొని నడిపించాడని లైగర్ పక్కా మూవీ అని కితాబిచ్చేశాడు. యాక్షన్‌ స్టంట్స్‌ అదరగొట్టేశాడని రివ్యూలో చెప్పుకొచ్చాడు.

విజయ్ దేవరకొండ వన్ మేన్ షో చేశాడు. సినిమా మొత్తం విజిల్స్ వేయిస్తుందని ప్రశంసించాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణది ఒక సర్ ప్రైజ్ ప్యాకేజ్ అని ట్వీట్‌ చేస్తూ సినిమాకు మూడు స్టార్లు ఇచ్చాడు ఉమైర్ సంధు.