శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 12 డిశెంబరు 2014 (13:15 IST)

రజినీకాంత్ వన్ మేన్ షో... నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్ 'లింగ'... మినీ రివ్యూ రిపోర్ట్

లింగ నటీనటులు: రజినీకాంత్, అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా, జగపతి బాబు తదితరులు, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, బేనర్: రాక్ లైన్ ఎంటర్ టైన్మెంట్స్, సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, విడుదల: డిశెంబరు 12, 2014.
 
కథ: గ్రామస్తుల శ్రేయస్సు కోసం రాజా లింగేశ్వర(రజినీకాంత్) రిజర్వాయిర్ నిర్మించాలనుకుంటాడు. ఐతే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ రిజర్వాయిర్ నిర్మాణానికి అంగీకరించదు. అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాల్సిందిగా హుకుం జారీ చేస్తుంది. అలా ఆనాడు లింగ కనిపించకుండా వెళ్లిపోతాడు. ఆ తర్వాత కాలం గడిచిపోతుంది. ఓ ఊరిలో దొంగగా ఉన్న రజినీకాంత్ ను మహిళా విలేకరి( అనుష్క) చూసి అతడు రాజా లింగేశ్వర వారసుడు అని చెపుతుంది. అతడిని అక్కడ నుంచి తన తాత రాజా లింగేశ్వర నివశించిన గ్రామానికి తీసుకెళుతుంది. ఇక అక్కడ లింగా ఏం చేశాడన్నది స్టోరీ. 
నటీనటుల పెర్ఫార్మెన్స్: 
రజినీకాంత్ మొత్తం చిత్రాన్ని భుజంపై వేసుకుని మోసేశాడని చెప్పొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ముత్తు-శివాజీ చిత్రాల కలబోత ఈ చిత్రమని చెప్పొచ్చు. జమీందారుగా, దొంగగానూ రజినీకాంత్ ద్విపాత్రల్లో బాగా ఎంటర్నైన్ చేశాడు. 65 ఏళ్లయినా రజినీ ఎనర్జీ లెవల్స్ ఏమాత్రం తగ్గలేదు. చురుకుదనం, స్టైల్, హావభావాలు సూపర్బ్ గా ఉన్నాయి. మొత్తంగా ఈ చిత్రాన్ని రజినీకాంత్ ఒక్కడే లాగించేశాడు. ఇక సోనాక్షి సిన్హా పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. బాలీవుడ్ సెక్సీ గర్ల్ సోనాక్షి పల్లెటూరి పిల్లగా నటించింది. అనుష్క శెట్టి పాత్రికేయురాలిగా నటించింది. తన పాత్రకు ఆమె న్యాయం చేసింది. మిగిలిన పాత్రలు కూడా వారి మేరకు వారు చేసేశారు. 
 
విశ్లేషణ: దర్శకుడు కె.ఎస్ రవికుమార్ స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యం తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది చక్కగా చూపించాడు. నరసింహ చిత్రం సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన రవికుమార్ లింగ చిత్రంతోనూ మళ్లీ అదే సక్సెస్ అందించేందుకు ప్రయత్నించాడని చెప్పొచ్చు. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం గరించి వేరే చెప్పక్కర్లేదు. రత్వవేల్ ఫోటోగ్రఫీ అదరహో అని చెప్పక తప్పదు. సాబు ఆర్ట్ సూపర్ గా ఉంటుంది. సంభాషణలు కూడా ఆకట్టుకుంటాయి. ఐతే ఫైటింగ్ సన్నివేశాల్లో ఎడిటింగ్ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. 
 
మొత్తమ్మీద నిర్మాణపు విలువలు లింగాను మంచి చిత్రంగా నిలబెడుతుంది. లింగ చిత్రం రజినీకాంత్ గత చిత్రాల రికార్డులను తిరగరాస్తుందో లేదో చెప్పాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
రేటింగ్: 3.5/5