శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : గురువారం, 14 మే 2015 (17:28 IST)

'గాడ్సే.. బోస్‌'' ఎలా అయ్యాడు.. 'లయన్' రివ్యూ రిపోర్ట్..!

సినిమా : లయన్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ,  త్రిష, రాధిక ఆప్టే, ప్రకాష్‌రాజ్‌ తదితరులు.
సంగీతం: మణిశర్మ, 
నిర్మాత: రుద్రపాటి రమణారావు, 
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్యదేవ.
 
పాయింట్‌: గాడ్సే.. బోస్‌ ఎలా అయ్యాడనేదే కథ.
నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండుగే. కానీ... కొత్త దర్శకుడు సత్య ఎలా తీస్తాడనే టెన్షన్‌ కూడా వుంది. ఇది దర్శకుడికీ వుంది. ఒక్కసారి కథ విన్నాక.. మళ్ళీదాని గురించి చర్చించే అలవాటులేని బాలయ్య.. ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అయితే.. సినిమా విడుదలముందు... ఆంధ్రలోనే కొన్ని చోట్ల బిజినెస్‌ కాలేదనేది నిజం. ఈ విషయంలో నిర్మాత, దర్శకుడుకూడా.. చివరి నిముషం వరకు అమ్ముడయిందని చెబూతూనేవున్నారు. సురేష్‌ప్రొడక్షన్స్‌ కొన్ని ఏరియాల్లో రిలీజ్‌ చేస్తే చెప్పిన రేటుకు ఎవ్వరూ రాకపోతే.. గుంటూరు, కడప వంటి చోట్ల నిర్మాతే ఓన్‌గా రిలీజ్‌ చేయాల్సివచ్చింది. ఎం.ఎల్‌.ఎ.గా అయ్యాక.. తన కథను ఏవిధంగా ఎంచుకున్నాడో కథలోకి వెళదాం.
 
కథగా చెప్పాలంటే..
ముంబైలోని రామ్‌మనోహర్‌లోహియా ఆసుపత్రి మార్చులో వున్న గాడ్సే (బాలకృష్ణ) సడెన్‌గా పైకిలేచి తాను బోస్‌ అంటాడు. చుట్టుప్కలవారితోపాటు తల్లిదండ్రులు చంద్రమోహన్‌, జయసుధ వచ్చి గాడ్సే అని పిలిచినా వినడు. అయితే బోస్‌ అని నిరూపించుకోవాలంటే హైదరాబాద్‌ వస్తాడు బాలయ్య. అక్కడ తను పుట్టినప్లేస్‌కు వస్తాడు. ఎవ్వరూ ఆయన్ను గుర్తుపట్టరు. అలాంటి టైంలో ఓ సంఘటన జరుగుతుంది. దాంతో బోస్‌ గతం కళ్ళముందు కన్పిస్తుంది. 
 
ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. బోస్‌.. ఓ సిన్సియర్‌ సీబీఐ అధికారి. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి అచ్యుతరామయ్య (విజయకుమార్‌) గుండెపోటుతో చనిపోతాడు. ఆయనిది సహజ మరణం కాదని దాన్ని శోధించమని సీబీఐ ఆయనకు ఆ బాధ్యత అప్పగిస్తుంది. ఆ కేసు పరిశోధనలోనే బోస్‌ మిస్‌ అవుతాడు. ఇక మిగిలిన కథ తెలిసిందే. అసలు గాడ్సే, బోస్‌ వేరువేరా? హైదరాబాద్‌ వచ్చిన బోస్‌ను తల్లిదండ్రులు ఎందుకు గుర్తుపట్టలేదు. ముఖ్యమంత్రి మరణం వెనుక అసలు వ్యక్తి ఎవరు? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌
చిత్రంలో చెప్పాల్సింది బాలకృష్ణ గురించే. సినిమా అంతా ఆయనే తన భుజాలపై వేసుకున్నాడు. గాడ్సే పాత్రలోని రౌద్రం ఫ్యాన్స్‌కు మాస్‌ను ఆకట్టుకుంటుంది. దానికి తగినట్లు డైలాగ్స్‌కు క్లాప్స్‌ పడతాయి. త్రిష పాత్రమేరకు బాగా చేసింది. రాధిక ఆప్టే మాత్రం కేవలం గ్లామర్‌ కోసమే వుంది. పోటీ నటుడిగా ప్రకాష్‌రాజ్‌ జీవించాడు. తల్లిదండ్రులుగా జయసుధ, చంద్రమోహన్‌ సెంటిమెంట్‌ పాత్రల్లో మరిపించారు. ఇక శివబాలాజీ, ఆదిత్యమీనన్‌, చలపతిరావు పాత్రలు మామూలే. అయితే మరో కీలక పాత్ర ఇందులో పోసాని ప్లేచేశారు. పోలీసు ఆఫీసర్‌. కామెడీ పాత్రే.
 
టెక్నికల్‌పరంగా..
వెంకటప్రసాద్‌ కెమెరాపనితం చాలా బాగుంది. ఆర్ట్‌ రదీంద్రర్‌ తన సీనియారిటీ చూపించాడు. బాలయ్య సినిమాలంటే దాదాపు ఎక్కువశాతం మణిశర్మ బాణీలే. మారిన ట్రెండ్‌నుబట్టి ఆయన యూత్‌ను ఆకట్టుకునే ట్యూన్స్‌ ఇవ్వలేకపోయాడనే చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజికే ఒక్కటే బాగుంది. ఇక రామ్‌లక్ష్మణ్‌ల ఫైట్స్‌ కంపోజ్‌ అదుర్స్‌. ముఖ్యంగా ట్రైబల్‌ ఏరియాలో చేసిన ఫైట్స్‌ ఎట్రాక్షన్‌గా వున్నాయి. చివరగా దర్శకుడి గురించి చెప్పాలి. కథ, స్క్రీన్‌ప్లేలో కొత్తదనంలేకపోయినా.. చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ఎఫెక్ట్‌గా చేయలేకపోయాడు.
 
విశ్లేషణ
సినిమా కథకు హీరో ప్రాణం, అయినా ఆయన ఒక్కడే చేస్తే సరిపోడు. ప్రతినాయకుడూ చేయాలి. అతనూ చేసినా సరిపోదు. కథలో దమ్ము వుండాలి. స్క్రీన్‌ప్లేలో ట్విస్ట్‌లు వుండాలి. ఇవన్నీ ఇందులో లేవు. మొదటిభాగంలో స్పీడ్‌గా పావుగంటపైగా సాగే కథనం ఒక్కసారిగా డ్రాప్‌ అయిపోతుంది. దాదాపు ఫస్ట్‌ఆఫ్‌ అయ్యేంతవరకు కథలో ట్విస్ట్‌ వుండదు. ఆడియన్స్‌ బోర్‌గా ఫీలయ్యేది మొదటి భాగమే. 
 
ఇక సెకండాఫ్‌లో జోరు పెంచాడు. హాస్యంపేరుతో కొన్నిచోట్ల బలవంతంగా చొప్పించిన సన్నివేశాలు కన్పిస్తాయి. అలీ, ఎంఎస్‌.లు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు. అయితే ప్రధాన లోపం.. సీబీఐ ఆఫీసర్‌ పాత్రను తీర్చేవిధానం సరిగ్గాలేదు. ముందు కొన్ని డీల్‌చేసిన కేసులు చూపించకుండా డైరెక్ట్‌గా సి.ఎం. కేసును డీల్‌ చేయడంలో డెప్త్‌ లోపించింది.
 
కొత్తగా దర్శకత్వం వహించే అవకాశం వచ్చినప్పుడు సీనియర్స్‌ సలహాలు తీసుకుంటే బాగుండేది. దాసరి శిష్యుడుగా చేసిన సత్యదేవా చేసిన మైనస్‌ అదే. టెక్నికల్‌గా మెచ్యూరిటీ చూపించలేకపోయాడు. సింహా, లెజెండ్‌ల్లో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చిత్రంగా వున్నా.. మనిషిని టచ్‌ చేసే సెంటిమెంట్‌ ప్రాణంగా నిలిచింది. అది లయన్‌లో లోపించింది. గాడ్సేను దేశప్రజలు విలన్‌గా చూస్తారు. బోస్‌ను దేశభక్తుడిగా గౌరవిస్తారు. ఈ రెండు పేర్లు పెట్టిన దర్శకుడు ఆ పాత్రల తీరును మరింతగా హైలైట్‌ చేస్తే బాగుండేది. సుభాష్ చంద్రబోస్‌.. మిస్సింగ్‌ మిస్టరీ ఇప్పటికీ తెలిసిందే. దాన్నుంచి కథను అల్లుకుని సిబిఐ ఆఫీసర్‌గా రాసుకున్నాడనే పాయింట్‌కూడా కన్పిస్తుంది. 
 
ఏదిఏమైనా... నందమూరి ఫ్యాన్స్‌కు మాత్రం బాలయ్యచేసే విన్యాసాలు నచ్చుతాయి. బి,సి. సెంటర్లలో బాగా ఆదరిస్తారనే చెప్పాలి. మిగిలిన సెంటర్లలో ఏవరేజ్‌ చిత్రంగా నిలుస్తుంది.

రేటింగ్ : 2.5/5