శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (17:24 IST)

విశాల్, హన్సికల 'మగ మహారాజు' మూవీ రివ్యూ రిపోర్ట్...

మగ మహారాజు నటీనటులు : విశాల్‌, హన్సిక, వైభవ్‌ రెడ్డి, సంతానం, ప్రభు, రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్‌ రాథోడ్‌, మధురిమ, మధులత తదితరులు; టెక్నికల్‌ : నిర్మాత- విశాల్‌, సంగీతం : హిప్‌ హాప్‌ తమీజ, దర్శకత్వం: సుందర్‌ సి. 
 
విడుదల తేదీ : 27 ఫిబ్రవరి 2015
 
విశాల్‌ సినిమాలు తమిళంలో ఆడాక తెలుగులో డబ్‌ అవుతుంటాయి. 'అంబల' పేరుతో తయారైన చిత్రం సంక్రాంతికి విడుదలై సక్సెస్‌ కాలేదు. కానీ తెలుగులో అయినా అవుతుందని ఈరోజు 'మగ మహారాజు'గా విడుదల చేశారు. గతంలో పందెం కోడి, భరణి చిత్రాలు విశాల్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అలాంటి కోవలో ఈ చిత్రం వుంటుందని చెబుతూ వస్తున్నాడు. ఆ తర్వాత 'చంద్రకళ' అనే థ్రిల్లర్‌ తీసిన సుందర్‌ సి. దర్శకత్వం వహించడం ఓ అంచనా ఏర్పడింది. అయితే అవి నిరాశగానే మిగిలిపోయాయి. భారీ తారాగణం నటించిన ఈ సినిమాలో ఏం మిస్‌ అయ్యాడో చూద్దాం.

 
కథ : 
సెటిల్‌మెంట్‌లకు, దందాలకు మనుషులను సప్లయి చేసే ఏజెంట్‌గా వుండే కృష్ణ(విశాల్‌), తను నల్లగా వున్నా తెల్లటి అమ్మాయి కోసం వెతుకుతుంటాడు. అనుకోకుండా మాయ(హన్సిక)ని చూసి ప్రేమలో పడతాడు. పోలీసు కానిస్టేబుల్‌ రాజశేఖర్‌(సంతానం) స్నేహితుడు. అతని ద్వారా తెలివిగా మాయను తనను ప్రేమిస్తున్నట్లు చేసుకుంటాడు. కానీ ఓ సంఘటనతో ఆమె తెగతెంపులు చేసుకుంటుంది. మందు కొట్టి ఇంటికి వచ్చిన కృష్ణను చూసి వాళ్ళమ్మ తులసి.. బాధతో గతాన్ని గుర్తు చేసుకుంటుంది. 
 
దాని ప్రకారం అతని తండ్రి కేశవరాజు(ప్రభు)ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ వెతుకులాటలో సొంత తమ్ముళ్లయిన కుమార్‌(వైభవ్‌), కిషన్‌(సతీష్‌) ఉన్నారని కృష్ణకు తెలుస్తుంది. వారంతా కలిసి తన తండ్రి ముగ్గురు చెల్లెళ్ళ వద్దకు వెళ్ళి వారి కూతుర్లను పెండ్లి చేసుకోవాలనేది కేశవరాజు కోరిక. అందుకోసం ఊరికి వెళ్ళగా అక్కడ ఓ అత్తయ్య ప్రత్యర్థికి పోటీగా రాజకీయాల్లోకి దిగి ఎం.ఎల్‌.ఎ.గా అవ్వాలనుకుంటుంది. ఇది తెలిసిన కృష్ణ, అతని సోదరులు ఆమెకు ఏవిధంగా సాయపడ్డారు? ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌ : 
ఇందులో విశాల్‌ తనదైన శైలిలో చేసేశాడు. యాక్షన్‌ పరంగా అతని బాడీకి సూటయింది. వైభవ్‌, సతీష్‌‌లు కూడా బాగా చేసారు. ముఖ్యంగా వీళ్ళ కాంబినేషన్‌‌లో వచ్చే కామెడీ సీన్స్‌ నవ్విస్తాయి. హన్సిక ఈ సినిమాలో మోస్ట్‌ గ్లామరస్‌ పాత్రలో కనిపించి మాస్‌ ఆడియన్స్‌‌ని బాగా ఆకట్టుకుంది. పాటల్లో ఎక్కువగా అందాలు ఆరబోసింది. ఇక సంతానం పాత్రపైనే నవ్వులు వచ్చేలా దర్శకుడు కేర్‌ తీసుకున్నాడు. పొగరు గల అత్తయ్యలుగా రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్‌ రాథోడ్‌లు న్యాయం చేసారు. ఇది కాకుండా హన్సిక తర్వాత హీరోయిన్స్‌‌గా కనిపించిన మధురిమ, మాధవీలతా వారికి స్క్రీన్‌ టైం దొరికినప్పుడల్లా గ్లామర్‌‌తో ఆకట్టుకున్నారు. మరో నటి పూనం బజ్వా ఐటంసాంగ్‌కి పరిమితమైంది.
 
సాంకేతిక విభాగం : 
గోపి అమర్నాథ్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పాటల్లో వచ్చిన విదేశీ అందాలు, పొల్లాచ్చిలో షూట్‌ చేసిన విజువల్స్‌ బాగున్నాయి. నిర్మాణ వాల్యూస్‌ బాగా రిచ్‌‌గా ఉన్నాయి. సినిమా కథ రేంజ్‌‌కి మించి ఎక్కువ ఖర్చు పెట్టారు. అందుకే విజువల్స్‌ మరీ గ్రాండ్‌‌గా ఉన్నాయి. దీని తర్వాత బెటర్‌ అంటే తెలుగులో శశాంక్‌ వెన్నెలకంటి రాసిన డైలాగ్స్‌. ఇందులో కొన్ని డైలాగ్స్‌ బాగా పేలాయి. బ్యాక్‌‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా మరీ లౌడ్‌‌గా ఉంటుంది. ప్రతిచోటా సందర్భానికి మించి శృతి మించి మ్యూజిక్‌ ఇచ్చాడు. శ్రీకాంత్‌ ఎడిటింగ్‌ కూడా అంత గొప్పగా లేదు. మొదటిభాగం తక్కువగానూ, సెకండాఫ్‌ ఎక్కువగానూ అనిపిస్తుంది. 
 
విశ్లేషణ 
ఏ సినిమాకైనా కథ మూలం. ఆ కథ ఆకట్టుకునేలా వుండాలి. మగమహారాజులో కథ ఏమంత గొప్ప కథ కాదు. అలాఅని తీసేసే కథకాదు. కాకపోతే కథంతా ప్రేక్షకుడు ఊహించుకునేట్లుగా జరగడమే ప్రధాన లోపం. దర్శకుడు ఈ లోపం సరిద్దుకోలేకపోయాడు. చంద్రకళలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా వుంచగలిన అంశాలను ఇందులో లేవు. ఇవి కాకుండా ఒకే కుటుంబం నుంచి విడిపోయిన అన్నాచెల్లెళ్ళను తమ వారసులు వచ్చి కలపడం అనే కాన్సెప్ట్‌‌తో ఇప్పటికే ఎంతోమంది దర్శకులు తీసారు. కథనంలో ఒక్క ట్విస్ట్‌ కూడా లేదు. చాలా ఫ్లాట్‌‌గా వెళ్తుంది. పోలీసు పాత్రలో సంతానం ఎక్కువగా కామెడీ కోసం ట్రై చేశాడు. అదికూడా ఓ దశలో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. 
 
చిత్రంలో ప్రత్యేకత ఏమంటే... హిప్‌హిప్‌.. సాంగ్‌లు పాడే దర్శకుడు మ్యూజిక్‌ బాగానే కొట్టాడు. పాటలు బాగున్నాయి. కానీ ఇదే సినిమాను నిలబెట్టలేదు. మాస్‌ ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని తీశారు. గతంలో విశాల్‌ చిత్రాల తరహాలో వున్నా బాగుండేది. కొత్తగా ప్రయత్నం చేయాలని ట్రై చేసి ఫెయిల్‌ అయ్యాడనే చెప్పాలి. కమర్షియల్‌ సినిమాతో ఎంటర్టైన్‌ చేసిన విశాల్‌ వెరీ రొటీన్‌ అండ్‌ ఓల్డ్‌ స్టొరీతో చేసిన ఈ సినిమాలో ప్రేక్షకులు ఆశించే అంశాలు కూడా సరిగా లేకపోవడం ఈ సినిమాకి బిగ్గెస్ట్‌ మైనస్‌. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు, సంతానం కామెడీ, హన్సిక గ్లామర్‌, సెకండాఫ్‌‌లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్‌ ఈ సినిమాకి ప్లస్‌. అయితే ఓల్డ్‌ స్టొరీ, వెరీ బోరింగ్‌ స్క్రీన్‌ ప్లే, వీక్‌ డైరెక్షన్‌, మినిమమ్‌ ఎంటర్‌‌టైన్మెంట్‌ కూడా లేకపోవడం ఈ సినిమాకి మేజర్‌ మైనస్‌ పాయింట్స్‌. పేరుకు తగినట్లుగా మగ మహారాజుగా వుండాలంటే కథపై ఎక్కువగా శ్రద్ధ పెడితే బాగుండేది. 
 
రేటింగ్‌ : 2.5/5