శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 15 జులై 2016 (19:50 IST)

'నాయకి' త్రిషకు ఉపయోగపడిందా...? రివ్యూ రిపోర్ట్

నాయకి నటీనటులు : త్రిష, సత్యం రాజేష్‌, సుష్మా రాజ్‌, గణేష్‌ వెంకట్రామన్‌; దర్శకత్వం : గోవీ; నిర్మాతలు : గిరిధర్‌ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి; సంగీతం: రఘు కుంచె. ఇటీవల దెయ్యం సినిమాలకున్న గిరాకీతో

నాయకి నటీనటులు : త్రిష, సత్యం రాజేష్‌, సుష్మా రాజ్‌, గణేష్‌ వెంకట్రామన్‌; దర్శకత్వం : గోవీ; నిర్మాతలు : గిరిధర్‌ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి; సంగీతం: రఘు కుంచె.
 
ఇటీవల దెయ్యం సినిమాలకున్న గిరాకీతో చిన్న నిర్మాతలు ఈ ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు త్రిషకు మేనేజర్‌గా వ్యవహరించిన గిరిధర్‌ నిర్మాతగా మారి తీసిన చిత్రమిది. లేడి ఓరియెంటెడ్‌ మూవీ అని త్రిష నటిస్తున్నదనే ప్రచారంతో   చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 'ఐ లవ్‌ యు బంగారం' దర్శకుడు గోవికి ఇది రెండో చిత్రం. మరి ఈ చిత్రం దర్శకుడికి, నిర్మాతకు, త్రిషకు ఎలా వుపయోగపడుతుందో చూద్దాం.
 
కథ :
సంజయ్‌(సత్యం రాజేష్‌) సినిమా దర్శకుడు దెయ్యాలంటే లెక్కలేదని బిల్డప్‌లు ఇస్తుంటాడు. ఇతనికి సంధ్య(సుష్మా రాజ్‌) అనే స్నేహితురాలు ఉంటుంది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎంజాయ్‌ చేయాలని తెగ ప్లాన్‌‌లు వేస్తుంటాడు. మరోవైపు.. హైద్రాబాద్‌ శివారల్లోని దుండిగల్‌లో వరుసగా కొందరు వ్యక్తులు అదృశ్యమవుతూ ఉంటారు. అక్కడ ఓ బంగ్లా వైపు ఎవ్వరూ రావద్దని ప్రభుత్వం కూడా హెచ్చరిస్తుంది. ఇలాంటి సమయంలోనే సంజయ్‌ తన స్నేహితులతో బంగ్లాకు వెళ్ళి అక్కడ చిక్కుకుంటారు. అక్కడ గాయత్రి (త్రిష) అనే ఓ దయ్యం అంతా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ కోవలో సంజయ్‌ కూడా గాయత్రి వల్ల చాలా ఇబ్బందులు పడతాడు. అసలు గాయత్రి ఎవరు.. అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి? అనేది సినిమా చూడాల్సిందే..
 
విశ్లేషణ:
కథాపరంగా చూసుకుంటే కొత్తదేమీ కాదు. కానీ త్రిష చేయడంతో ఆ పాత్రకు ఇంట్రెస్ట్‌ కలిగింది. త్రిషని దెయ్యంగా పరిచయం చేయడం, తన బంగ్లాకు వచ్చేవారితో ఆమె ఆడుకునే ఆటలు, అప్పుడప్పుడు ఆమె పాత్ర ఓ సినిమా హీరోయిన్‌లా మారిపోయి వింతగా ప్రవర్తిస్తూ ఉండడం.. సత్యం రాజేష్‌ కామెడీగానూ, నెగిటీవ్‌ రోల్‌‌గానూ అతని నటన బాగుంది. ఇక సుష్మారాజ్‌ అమాయకురాలైన పాత్రలో ఫర్వాలేదనిపించింది. నటుడు జయప్రకాష్‌ తన స్థాయికి తగ్గ నటన ప్రదర్శించాడు. 
 
ఇక ఫస్టాఫ్‌లో కామెడీ, సెకండాఫ్‌‌లో థ్రిల్లింగ్‌ హర్రర్‌ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దెయ్యం సినిమాలు చూసి ఎంజాయ్‌ చేసేవారికి ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. అదే క్రమంలో దర్శకుడు గోవి చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా చెప్పకుండా కాస్త కన్‌ఫ్యూజ్‌ చేసి చూపించాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాల్లో వున్న క్యూరియాసిటీ కాస్త లోపించింది. కొత్త కథాంశాన్నే ఎంచుకున్న గోవీ, దాన్ని పూర్తిస్థాయి కథగా మార్చడంలో మాత్రం తడబడ్డాడు. 
 
దెయ్యం సినిమా కాబట్టి నైట్‌ ఎఫెక్ట్‌ తగినట్లుగా లైటింగ్‌తో మూడ్‌ను సినిమాటోగ్రాఫర్‌ జగదీష్‌ చీకటి బాగా క్యారీ చేశాడు. రఘుకుంచె అందించిన ఆడియోలో చెప్పుకోదగ్గస్థాయి లేకపోయినా సాయికార్తీక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగుంది. ఇక మిగిలిన డిపార్ట్‌మెంట్‌ ఫర్వాలేదు. బేసిక్‌గా దెయ్యం కాన్సెప్ట్‌ అనేది కొత్తేమికాదు. ఎన్నిసార్లు అయినా ప్రేక్షకుల్ని భయపెట్టినా కొత్తగా వుంటుంది. ఆ వీక్‌నెస్‌తో తీసిన చిత్రమిది. మొత్తంగా ఏవరేజ్‌ చిత్రమిది.
 
రేటింగ్ ‌: 2/5