అసలైన బయోపిక్ రాకెట్రీ - రివ్యూ రిపోర్ట్
మాధవన్ నటించి నిర్మించిన లివింగ్ లెజెండరీ బయోపిక్ రాకెట్రీ. ఇక్రిసాట్ శాస్త్రవేత్త, వికాశ్ శాటిలైట్ రూపకర్త నంబి నారాయణన్ జీవిత గాథను వెండితెర ఆవిష్కరించారు మాధవన్. 80 ఏళ్ళ నంబి నారాయణన్ కు 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరువుతో సత్కరించింది కూడా. అలాంటి నంబి నారాయణన్ శాస్త్రవేత్తగా వున్నప్పుడు దేశం కోసం ప్రాణాలకు తెగించి ఓ శాటిలైట్ కోసం చేసిన ప్రయత్నంలో దేశద్రోహి ముద్ర పడింది. దానికోసం 15ఏళ్ళపాటు జైలులో వున్నారు. మానసిక క్షోభ అనుభవించారు. అలాంటి ఆయన జీవితగాధను ఇప్పటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనావ ఉంది. మరి ఈ సినిమా జూలై1న దక్షిణాది భాషలతోపాటు హిందీలో కూడా విడుదల కాబోతుంది. మరి అది ఎలా వుందో చూద్దాం.
కథః
కేరళకు చెందిన నంబి నారాయణన్ (మాధవన్) ఇంటికన్నా ఉద్యోగం మిన్న అన్నంతగా పనిచేస్తుంటాడు. ఇస్రో శాస్త్రవేత్త. స్పురద్రూపి. మేథావి. ఒకరోజు ఇంటి నుంచి గుడికి వెళతాడు నంబి. అక్కడ అర్చకుడు హారతి నిరాకరిస్తాడు. బయటకు వెళ్ళిన కూతురు, కొడుకును జనాలు రాళ్ళతో కొట్టి అవమానిస్తారు. ఇంటి దగ్గర అదే పరిస్థితి ఇంటిలోకి రాళ్ళువేసి.. నంబి దేశద్రోహి అంటూ ప్లకార్డులు పట్టుకుని గొడవ చేస్తుంటారు. పోలీసులు చోద్యం చూస్తుంటారు. కట్‌చేస్తే.. టీవీ స్టూడియోలో సూర్య శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను ఇంటర్యూ చేస్తాడు. అలా దర్శకుడు మాధవన్ కథనం చూపించాడు. అసలు నంది ఎవరు? ఏమేం చేశాడు. చివరికి ఎందుకు ఇలా అవ్వాల్సివచ్చింది? అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు సూర్య వేస్తూండగా నంబి నారాయణన్ తన కాలేజీ జీవితం నుంచి శాస్త్రవేత్తగా ఎంత పురోగతిని సాధించింది. అందుకు దోహదపడిన అంశాలు, రష్యా, అమెరికా, ఫ్రాన్స్ సైంటిస్టుల సహకారం ఎలా వుందో వివరిస్తూంటాడు. ఆ తర్వాత దేశద్రోహి అని ముద్రపడడం, 1998లో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం వంటివి చెబుతాడు. ఫైనల్‌గా తనపై దేశద్రోహి ముద్ర వేసింది ఎవరనేది ఇంతవరకు తెలీదు? మన ప్రభుత్వం కూడా చెప్పలేదు. కానీ నన్ను మానసిక క్షోభకు గురిచేసి లక్షల ఆస్తిని నాశనం చేసి, కుటుంబం పరువు ప్రతిష్టలు దిగజార్చిన వారెవరనేది ఇప్పటికీ జవాబు అందని ప్రశ్నంగా నిలిచిందంటూ.. అసలైన నంబి నారాయణన్ ముగింపులో చెప్పడం విశేషం.
విశ్లేషణః
ఇప్పటివరకు బయోపిక్‌లు మరణించిన రాజకీయనాయకులు, సినీ నటులు, బందిపోట్లు, నగ్జైలైట్ల గురించి కథలు వచ్చాయి. కానీ రియల్‌గా హీరో అయిన నంబి నారాయణన్ వంటి కథ రావడం విశేషం. నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ పరకాయ ప్రవేశం చేశారు. ఆయన గురించి రాసిన పుస్తకాల ఆధారంగా, నంబి నారాయణన్‌ను కలిసి తెలుసుకున్న విషయాలతో ఆయన మేనరిజంతో జీవించేశారనే చెప్పాలి. ఆయన భార్యగా సిమ్రాన్ నటించింది. క్లయిమాక్స్ లో ప్రజలు పెడుతున్న టార్జెర్‌తో పిచ్చిదానిలా ఎలా మారిందనేది కంటతడిపెట్టిస్తుంది. ఇక మిగిలిన పాత్రలన్నీ మనకు తెలియని మళయాళ నటీనటులే.
మామూలు సినిమాల్లో వుండే పంచ్‌లు, కామెడీ, సెంటిమెంట్ ఇందులో కనిపించవు. ఎందుకంటే ఇది వాస్తవ కథ. ఇందులో పరిస్థితులే శత్రువులు. ఈ సినిమాలో సైంటిస్టులు శాంతాభాయ్, అబ్దుల్ కలామ్ పాత్రలు కూడా కనిపిస్తాయి. అందరికంటే మేథావి అయిన నంబి నారాయణన్ చాలా తెగింపు వున్నవాడు. అలాంటి మేథావి. తెగింపు వున్నవాడికి ఎంత అభివృద్ధి వుంటుందో అంతే దిగిపోతాడు.. అంటూ శాంతభాయ్ ఓ సందర్భంలో డైలాగ్ చెబుతాడు. సరిగ్గా క్లయిమాక్స్‌లో అలానే జరుగుతుంది.
అయితే ఇంతవరకు నంబి నారాయణన్ జీవితంలో విలన్ ఎవరనేది చెప్పలేని పరిస్థితి. అప్పటి కేంద్రప్రభుత్వం ఈయనపై దేశద్రోహి ముద్రవేయడానికి కారణమైంది. అందుకు అమెరికా చేయి కూండా వుందనేలా సన్నివేశాలున్నాయి. నంబి నారాయణన్ మేథస్సుకు అమెరికా ఆఫర్ ఇస్తుంది. కాదని తను రష్యా వైపు మొగ్గుచూపుతాడు. కారణం భారతదేశ్ రష్యాతో సత్‌సంబంధాలు పెట్టుకోవడమే. కానీ అమెరికాతో భారత్‌కు పెద్దగా సత్ సంబంధాలు లేవు. కానీ నంబి నారాయణన్‌ను దేశద్రోహి ముంద్ర వేయడంలో భారత్ ప్రభుత్వం పావులా వాడుకుంది. ఈ విషయాలు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి..
ఇలాంటి కథలు, బయోపిక్‌లను ఇప్పటి తరం తెలుసుకోవాలి. మంచిని ఆస్వాదించాలి. అయితే ఇటీవలే కేరళకుచెందిన `మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్‌పై చిత్రం వచ్చింది. ఇప్పుడు కేరళకు చెందిన నంబి నారాయణన్ బయోపిక్ వచ్చింది. బిజెపి. ప్రభుత్వం నంబి నారాయణన్ కు పద్మభూషణ్ ఇచ్చి సత్కరించడం వంటి సన్నివేశాలు క్లయిమాక్స్‌లో చూపిస్తారు. ఫైనల్‌గా చూస్తే.. అప్పట్లో పటేల్ మరణం మిస్టరీ. ఇప్పుడు నంబి నారాయణన్ పై దేశద్రోహిగా మార్చింది ఎవరనేది కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఎడ్యకేటెడ్ సినిమాగా దీన్ని పేర్కొనవచ్చు.
రేటింగ్ -3/5