శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (17:30 IST)

'రాజా చెయ్యి వేస్తే' ఏమయ్యింది... రివ్యూ రిపోర్ట్...

రాజా చెయ్యి వేస్తే నటీనటులు :నారా రోహిత్‌, తారకరత్న, ఇషా తల్వార్‌, శివాజీరాజా, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు; నిర్మాత : సాయి కొర్రపాటి, సంగీతం : సాయి కార్తీక్‌, దర్శకత్వం : ప్రదీప్‌ చిలుకూరి. ప్రస్తుతం ఏ హీరో లేనంత బిజీగా నారావారి వారసుడు రోహిత్‌ వున్

రాజా చెయ్యి వేస్తే నటీనటులు :నారా రోహిత్‌, తారకరత్న, ఇషా తల్వార్‌, శివాజీరాజా, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు; నిర్మాత : సాయి కొర్రపాటి, సంగీతం : సాయి కార్తీక్‌, దర్శకత్వం : ప్రదీప్‌ చిలుకూరి.
 
ప్రస్తుతం ఏ హీరో లేనంత బిజీగా నారావారి వారసుడు రోహిత్‌ వున్నాడు. అదేవిధంగా ఏ నిర్మాత తీయనంతగా చకచకా సినిమాలు తీసేస్తున్నాడు సాయి కొర్రపాటి. వీరిద్దరూ కలిసి తీసిన సినిమానే 'రాజా చెయ్యి వేస్తే'. కొత్త కథలు కాకపోయినా.. స్క్రీన్‌ప్లే పరంగా కొత్తగా వుండేలా తాపత్రయపడే నారా రోహిత్‌.. ఈసారి తన బంధువైన నందమూరి తారకరత్నను విలన్‌గా చేశాడు. ఈ చిత్రం షూటింగ్‌ కూడా చాలా స్పీడ్‌గా జరిగింది. నారా వారు చేయివేస్తే నెలకో సినిమా విడుదల అవ్వాల్సిందే అన్నంతగా ముందుకు సాగుతున్న రోహిత్‌ ఇందులో ఏం చేశాడో చూద్దాం.
 
కథ :
మాణిక్‌ (తారకరత్న) క్రిమినల్‌. మంత్రుల అండదండలు పుష్కలం. దాంతో పోలీసు వ్యవస్థ కూడా ఏమీ చేయలేదు. మరోవైపు.. రాజా రామ్‌ (నారా రోహిత్‌) ఆస్తిపరుడు. హైదరాబాద్‌ వచ్చి మూడేళ్ళలో దర్శకుడవ్వాలని కథలు రాసుకుంటూ ట్రై చేస్తూ వుంటాడు. ఎవ్వరూ సరైన పుషింగ్‌ ఇవ్వరు. పనిలోపనిగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి చైత్ర (ఇషా తల్వార్‌) ప్రేమను పొందుతాడు. తన ఆలోచనలు తనతో పంచుకుంటాడు. తానో కథ రాశానని.. ఓ కాఫీ షాప్‌లో ఆమెకు కథ చెబుతాడు. 
 
ఆ తర్వాత కథ నచ్చిందంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేసి తానే పెద్ద దర్శకుడ్ని.. ప్రేమకథను రాయమని చెబుతాడు. అలా తన ప్రేమకథను రాసేస్తాడు. కానీ ఆ తర్వాత యాక్షన్‌ కథలో విలన్‌ చంపే సీన్‌ను రాయమని మరోసారి చెబుతాడు. అది ప్రిపేర్‌ చేసే పనిలో వుండగానే. కథలో క్రిమినల్‌ను చంపినట్లు మాణిక్‌ను నువ్వే చంపాలని ఫోన్‌లో ట్విస్ట్‌ ఇస్తాడు. లేదంటే.. నీ ప్రేయసిని చంపేస్తానని బెదిరిస్తాడు. ఆ బెదిరించిన వ్యక్తి కూపీలాగే ప్రయత్నంలో చైత్రపై మాణిక్‌ ఎటాక్‌ చేస్తాడు. ఇది తెలిసిన రాజారామ్‌ ఏం చేశాడు? అసలు ఎందుకు ఎటాక్‌ చేయాల్సివచ్చింది? ఆ తర్వాత రాజారామ్‌ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌:
హీరోయిజం అంటే ఇలాగే వుండాలనే రూల్సేమీ పెట్టుకోకుండా నారా రోహిత్‌ గత సినిమాల్లో మాదిరే నటనను కనబర్చాడు. ఇంకా మెచ్యూర్డ్‌ పొందాలి. అయితే స్టయిలిష్‌గా నటించాడు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది తారకరత్న పాత్ర. తను మొదటిసారి పూర్తిస్థాయి విలన్‌గా చేశాడు. ఈ పాత్రకు విదేశీ సినిమాల స్పూర్తయినా.. సీరియస్‌గా డైలాగ్‌ డెలివరీగా పర్వాలేదు అనిపించాడు. ఇషా తల్వార్‌.. గుండెజారి గల్లంతయ్యిందెలో.. తర్వాత పూర్తిస్థాయి పాత్ర చేసింది. తను ఆ పాత్రను ఈజీగా చేసేసింది. ఇక మిగిలిన పాత్రల్లో శివాజీరాజా ఇతరత్రా నటవర్గం పాత్రలమేరకు మెప్పించారు.
 
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రఫీ పనితనం మెచ్చతగింది. ఇండోర్‌, ఔట్‌డోర్‌ లైటింగ్‌ పరంగా తీసుకున్న జాగ్రత్తలతో బాగున్నాయి. సంగీతపరంగా సాయి కార్తీక్‌ అందించిన ఆడియోలో చెప్పుకోవడానికి ఏవిూ లేదు. ఎందుకంటే హీరో పెద్ద డాన్సర్‌ కాదు కాబట్టి.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం బాగుంది. ఇక ఎడిటింగ్‌ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. వారాహి చలన చిత్రం ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌   బాగున్నాయి. దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్‌ రొటీన్‌ కథలతోనే స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌ చేస్తే ప్రేక్షకుడిని కూర్చోబెట్టొచ్చనే అంశాన్ని దర్శకుడు బలంగా నమ్మినట్లు కనిపిస్తుంది. అయితే ఆ స్క్రీన్‌ప్లే విషయంలో విదేశీ సినిమా ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. చిత్రంలో హైలైట్ డైలాగ్స్‌. పొందికగా అర్థవంతంగా రాశాడు. ఇక దర్శకుడిగా అక్కడక్కడా ప్రదీప్‌ ప్రతిభను చూడొచ్చు. విలన్‌ పాత్ర రూపొందించిన విధానం, హీరో, విలన్‌ల ఇంట్రడక్షన్‌.. ఇలా కొన్ని సందర్భాల్లో దర్శకుడి ప్రతిభ బాగుంది.
 
విశ్లేషణ:
రొటీన్‌ కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అది అనుకున్నంత స్థాయిలో లేకపోవడమే ఈ సినిమాకు ప్రధాన మైనస్‌ పాయింట్‌. దీంతోపాటు ఫార్ములా కథల్లో ఉండే రివెంజ్‌ డ్రామా, పెద్దగా ఆకట్టుకోని లవ్‌ట్రాక్‌, ఫస్టాఫ్‌ వరకూ అసలు కథంటూ మొదలవ్వకపోవడం ఈ సినిమాకు ఇతర మైనస్‌ పాయింట్స్‌. ఇకపోతే కట్టిపడేసే విలన్‌ క్యారెక్టరైజేషన్‌; నారా రోహిత్‌, తారకరత్నల నటన; సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ట్విస్ట్స్‌, వీటన్నింటికీ మించి ఫస్టాఫ్‌లో బాగా ఆకట్టుకునే ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ లాంటివి ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. విదేశీ ముద్రతో తెలుగు కథను జోడించి చేసే విధానం ఇప్పటి దర్శకుల్లో ఎక్కువగా వుంది. ఆ కోవలోనే ఈ సినిమా సాగుతుంది. 
 
హీరోను చంపమని ఫోన్‌ చేసి.. డైవర్ట్‌ చేసేది.. హీరోయిన్‌ అవ్వడం.. ప్లాన్‌ ప్రకారం.. తనను ప్రేమించేలా చేసుకోవడం వంటివి గత చిత్రాల్లోని సీన్లే. పతాక సన్నివేశంలో హీరో విలన్ల మధ్య సాగే ఆట ఎట్రాక్షన్‌గా వుంది. అసలు ఈ సినిమాను తారకరత్న కోసమే తీసినట్లుంది. తను విలన్‌ కూడా చేయగలడనే ముద్ర కోసం తాపత్రయపడ్డాడు.  రొటీన్‌గా సినిమాలో పాటలు ఎందుకొస్తాయో కూడా అర్థం కానట్టు ఉన్నాయి. కథకి అసలైన పాయింట్‌ని రివెంజ్‌కు కలపడనే తెలుగు సినిమా ఫార్ములా ఎప్పుడైతే కథలో ప్రవేశిస్తుందో, అక్కణ్ణుంచి ఒక్క ట్విస్ట్‌ మినహా సినిమా అంతా హీరో ప్లాన్‌ ప్రకారంగానే సాగిపోతూ పెద్దగా కిక్‌ ఇవ్వదు. సినిమా పరంగా చూస్తే ఫస్టాఫ్‌ ప్రధానమైన మైనస్‌గా నిలుస్తుంది. కామెడీ కోసం ప్రాకులాడకుండా.. వున్న క్యారెక్టర్లతో కొద్దిపాటి కామెడీ చేయించాడు. సో.. టైంపాస్‌గా కాసేపు గడిపే సినిమా ఇది.
 
రేటింగ్‌ : 2.5/5