శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 26 మే 2017 (08:37 IST)

"రారండోయ్ వేడుక చూద్దాం" అదిరిందంటున్న అమెరికా, దుబాయ్ ప్రేక్షకులు

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన తాజా చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం తొలి రోజు తొలి ఆటకు చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా ఒక రొటీన్ రివెంజ్ డ్రామాతో నడిచినప్పటికీ దర్శకుడు కథను నడిపించిన తీరు కుటుంబ ప్రేక్షకులను బాగా

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన తాజా చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం తొలి రోజు తొలి ఆటకు చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా ఒక రొటీన్ రివెంజ్ డ్రామాతో నడిచినప్పటికీ దర్శకుడు కథను నడిపించిన తీరు కుటుంబ ప్రేక్షకులను బాగా అలరిస్తుందని  ప్రేక్షకులు అంటున్నారు. అమెరికా, దుబాయ్‌లలో ఈ సినిమా ఫస్ట్ షో ఇప్పటికే ముగిసింది. రొమాన్స్ నుంచి డ్రామాకు, డ్రామా నుంచి యాక్షన్‌వైపుకు నడిచిన సినిమా ఇప్పటికే హిట్ టాక్‌ను సంపాదించింది. సినిమా తొలిభాగం పూర్తి వినోదాత్మకంగా సాగగా, రెండో భాగం కాస్త నెమ్మదించి, వినోదం పాళ్లు తగ్గింది కానీ, మొత్తం మీద అక్కినేని కుటుంబం నుంచి మరొక చక్కటి కుటుంబ గాధా చిత్రం వచ్చినట్లే అంటున్నారు ఆడియన్స్.
 
నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ తమ కెరీర్లోనే ఎన్నడూ చేయని పాత్రలను ఈ సినిమాలో పోషించారని ప్రేక్షకుల ఉవాచ. వారి నటన, ఇద్దరి మధ్య కుదిరిన అద్బుతమైన కెమిస్ట్రీ సినిమాకు హైలైట్స్‌గా మారింది. ఇక జగపతిబాబు, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమూర్తి, పృద్వీరాజ్, చలపతిరావు, రఘుబాబు, సప్తగిరి తమ పాత్రలను పోషించారని సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాకు నిర్మాత అయిన అక్కినేని నాగార్జున అత్యున్నత విలువలతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా రూపొందుకుంటుందని తొలినుంచి చెపుతూ వచ్చారు. ఆయన అంచనాకు తగ్గట్టుగానే, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ, యాక్షన్, డ్రామా సాంకేతికంగా హై రేంజ్‌లో ఉన్నాయని ఆడియన్స్ చెబుతున్నారు.
 
ఫ్రధమార్థం సూపర్‌గా సాగిందని, సెకండ్ హాప్ అబౌ ఆవరేజ్‌గా రూపొందిందని చెబుతున్న ఆడియన్స్ తమ వంతుగా సినిమాకు 5 కి 3.5 పాయింట్లు ఇవ్వడం విశేషం.
 
Censor Reports‏ @CensorReports
#RaRandoiVedukaChuddam - U 1st half - SuperHit 2nd Half - Abv Avg + Chaitu + Comedy + Songs-BGM - Routine Revenge 3.255 - HiT
 
Chay™‏ @KingDaSultan
Show Completed #RaRandoiVedukaChuddam good family entertainer Chay at his best , Rakul is good and her Chemistry with chay 3.55
 
Shashi‏ @onlyshashi9999
#RaRandoiVedukaChuddam done with 1st half @ThisIsDSP top notch bgm, @Rakulpreet refreshing acting @chay_akkineni wonderful screen presence. #Ninnepellaadtha for @iamnagarjuna. And #RaRandoiVedukaChuddam for @chay_akkineni stuffed with all ingredients, worth watch
 
Naga Chaitanya‏ @darling_chay
Father & Son scenes will be delight to all sons who love their fathers #RaRandoiVedukaChuddam Chay nad Jaggu rocked those scenes
 
Raj‏ @rajkumarmahanti
#RaRandoiVedukaChuddam First Half Good Second Half Very Good @chay_akkineni @Rakulpreet @kalyankrishna_k